Thursday, March 5, 2026

స్థానిక సంస్థల ఎన్నికలు: మొదటి విడత ఎంపీటీసీ, జడ్పీటీసీలకు రేపే (9న) నోటిఫికేషన్

- Advertisement -

స్థానిక సంస్థల ఎన్నికలు: మొదటి విడత ఎంపీటీసీ, జడ్పీటీసీలకు రేపే (9న) నోటిఫికేషన్

Local body elections: Notification for first phase MPTC and ZPTC tomorrow (9th)

స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. హైకోర్టు సైతం నోటిఫికేషన్ కు లైన్ క్లియర్ చేయటంతో.. మరికొన్ని గంటల్లో అంటే.. 2025, అక్టోబర్ 9వ తేదీన ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ కానుంది.

మొదటి విడతలో ఎంపీటీసీ, జడ్పీటీసీకు ఎన్నికలు జరగనున్నాయి. ఫస్ట్ ఫేస్‎లో 2 వేల 963 ఎంపీటీసీ స్థానాలకు.. 292 జడ్పీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది.

అక్టోబర్ 9వ తేదీ నుంచి నామినేషన్లు దాఖలు చేయొచ్చు. అక్టోబర్ 11వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. మొదటి విడత జరిగే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అక్టోబర్ 23వ తేదీన పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 11న జరగనుంది.

కొనసాగనున్న ఇద్దరు పిల్లల నిబంధన

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయదలిచిన అభ్యర్థుల అర్హతకు సంబంధించిన నిబంధనల్లో ఎలాంటి సడలింపు లేదు. ముఖ్యంగా, అభ్యర్థులకు సంబంధించి గతంలో అమలులో ఉన్న ‘ఇద్దరు పిల్లల నిబంధన’ కొనసాగనుంది. పంచాయతీ రాజ్ చట్టం 2018 సెక్షన్ 21 (3) ప్రకారం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్నవారు అనర్హులు.

అయితే.. ఒకే కాన్పులో కవలలు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు జన్మించి, దాంతో పిల్లల సంఖ్య ఇద్దరి కంటే పెరిగితే, ఆ కాన్పును ఒకే సంతానంగా పరిగణిస్తారు (చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం). మరోవైపు ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ సంతానం లిమిట్ ఎత్తివేశారు.

2018లో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించిన కేసీఆర్ ప్రభుత్వం ఈ విషయా న్ని టచ్ చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వం కూడా దీన్ని మార్చలేదు. ఈ నిబంధనను మార్చి ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వారికి సైతం పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పలు రాజకీయ పార్టీలు కోరాయి. అయితే అది కార్యరూపం దాల్చలేదు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్