
Distribution of bags to students under the leadership of SP D.V. Srinivasa Rao
‘యూత్ ఫర్ సేవా’ స్వచ్ఛంద సంస్థ సహకారంతో 50 వేల విలువైన విద్యా సామగ్రి పంపిణీ
ఇస్తాలపురం: వాయిస్ టుడే
మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, ‘యూత్ ఫర్ సేవా’ స్వచ్ఛంద సంస్థ తెలంగాణ–ఆంధ్ర ప్రదేశ్ కోఆర్డినేటర్ అరవింద్ సహకారంతో MPPS ఇస్తాలపురం పాఠశాల విద్యార్థులకు రూ.50,000 విలువైన బ్యాగుల పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది.
ఈ కార్యక్రమం స్థానిక MPPS ఇస్తాలపురం పాఠశాలలో హెడ్మాస్టర్ మల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఆత్మకూర్ మండల ఎంఈఓ ధారాసింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ధారాసింగ్ మాట్లాడుతూ, “తాను చదువుకున్న పాఠశాలలో విద్యార్థులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్న ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అభినందనీయులు” అన్నారు. ఆయన నిరుపేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారని తెలిపారు.
సీనియర్ జర్నలిస్టు జనార్దన్ మాట్లాడుతూ, “ఉన్న ఊరిని, చదువుకున్న పాఠశాలని మరవని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు నిజమైన స్ఫూర్తిదాయక వ్యక్తి” అన్నారు. విద్యార్థుల అభ్యాసానికి అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్న సంకల్పం ఎస్పీదని తెలిపారు.
ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, “తాను చదువుకున్న పాఠశాలకు, తాను పెరిగిన ఊరికి తానెప్పటికీ ఋణపడి ఉన్నాను. విద్యార్థుల అభ్యున్నతికి సాధ్యమైనంత సాయం అందిస్తాను” అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ మిత్రబృందం తూడి వెంకటేశ్వర్లు, పుప్పాల వీరన్న, ఈరుకుల శ్రీనివాస్, ‘యూత్ ఫర్ సేవా’ నల్గొండ జిల్లా ఇన్ఛార్జి నాగేంద్ర, టీచర్ రాజశ్రీ, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.



Distribution of bags to students under the leadership of SP D.V. Srinivasa Rao

