చిన్నటేకూరు వద్ద భయానక రోడ్డు ప్రమాదం – బస్సులో 20 మందికి పైగా మృతి

- Advertisement -

చిన్నటేకూరు వద్ద భయానక రోడ్డు ప్రమాదం – బస్సులో 20 మందికి పైగా మృతి
నిద్రలోనే మంటల్లో చిక్కుకున్న ప్రయాణికులు – అగ్నిమాపక సిబ్బంది చేరేసరికి బస్సు అస్థిపంజరమైపోయింది

Horrific road accident near Chinnatekuru – More than 20 people died in the busb

కర్నూలు జిల్లా, అక్టోబర్ 24:వాయిస్ టుడే 
కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ప్రాణాంతకంగా మారింది. బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ వి.కావేరి ట్రావెల్స్ బస్సు 🚌 వేగంగా ప్రయాణిస్తుండగా, ఒక ద్విచక్రవాహనం 🚲 ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.

సమాచారం ప్రకారం, ప్రమాదం జరిగిన సమయానికి సుమారు మూడున్నర గంటలు. బస్సులోని ప్రయాణికులు అందరూ గాఢనిద్రలో ఉన్నారు. బస్సు ముందు భాగం నుండి ఒక్కసారిగా మంటలు 💥💥 ఎగసిపడటంతో, కొద్ది క్షణాల్లోనే ఆ మంటలు మొత్తం బస్సును చుట్టుముట్టాయి.

భయంతో నిద్రలేచిన ప్రయాణికులు బయటపడేందుకు ప్రయత్నించినా, మంటలు ఆవలించడంతో చాలా మందికి బయటకు దారి దొరకలేదు. కొందరు ధైర్యం చేసి అద్దాలు పగలగొట్టి బయటకు దూకగా, వారికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. అయితే, మిగతా 20 మందికి పైగా నిద్రలోనే మృత్యువు ఒడికి చేరుకున్నారని సమాచారం.

అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరేసరికి బస్సు పూర్తిగా కాలిపోయి అస్థిపంజరంలా మారిపోయింది. మృతదేహాలు తీవ్రంగా కాలిపోవడంతో గుర్తించడం కూడా కష్టంగా మారింది.

రోడ్డుపక్కన కన్నీరు మున్నీరవుతున్న బంధువులు, తమవారిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్న దృశ్యం హృదయాన్ని హత్తుకుంది. “నిన్న సంతోషంగా బయలుదేరిన వాళ్లు… ఈరోజు ఇలా మిగిలిపోతారని ఎవరూ ఊహించలేదు,” అంటూ బంధువులు వేదన వ్యక్తం చేశారు.

ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బస్సు వేగం, ఇంధన లీకేజ్ లేదా షార్ట్‌సర్క్యూట్ కారణమా అనే దానిపై విచారణ కొనసాగుతోంది.

👉 ఈ ఘటనతో ప్రాంతం మొత్తంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular