ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్-1గా ఉండాలి…
దీనికి నేను కట్టుబడి ఉన్నాను.
తెలుగు జాతి నెంబర్-1గా ఉండాలంటే…
మనలో ఐకమత్యంగా ఉండాలి.
గుంటూరు
Telugu nation should be number 1 in the world…
గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గోని మాట్లాడారు.
తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలున్నా… తెలుగే మాతృభాష. రెండు రాష్ట్రాలు కలిసి ఉంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఎన్టీఆర్ సీఎం అయ్యాకే… సాగర్ జలాలను ఉపయోగించుకునేలా ఎస్ఎల్బీసీ, ఎస్ఎర్బీసీ ప్రాజెక్టులు తెచ్చారని అన్నారు. కల్వకుర్తి లిఫ్ట్, ఎఎమ్మార్ ఎత్తిపోతల, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులను నేను పూర్తి చేశాను. కృష్ణా డెల్టా మోడ్రనైజేషన్ పేరుతో నీటిని పొదుపు చేసి… ఆ నీటిని తెలంగాణకు కేటాయించి బీమా లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేశాం. గోదావరి నదిపై గుత్ప, అలీసాగర్, దేవాదుల ఎత్తిపోతల వంటి పథకాలను చేపట్టాం. ఆంధ్ర ప్రాంతంలో చాగల్నాడు, పుష్కర, తాటిపూడి వంటి లిఫ్ట్ ప్రాజెక్టులు తెచ్చాం. పట్టిసీమ ప్రాజెక్టుతో కృష్ణా డెల్టాకు నీరిచ్చాం. విభజన తర్వాత పోలవరానికి ప్రత్యేక నిధులిచ్చారు, ప్రత్యేక చట్టం రూపొందించారు. గతేడాది సుమారు కృష్ణా, గోదావరి నదుల నుంచి 6,282 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లాయి. గోదావరి నీళ్లు పుష్కలంగా ఉన్నాయి… గోదావరి నీళ్లను తెలంగాణ వాడుకున్నా అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా అభ్యంతరం చెప్పలేదు. ప్రతేడాది గోదావరి నుంచి సముద్రంలోకి 3వేల టీఎంసీల నీళ్లు వృధాగా పోతున్నాయి. కృష్ణా-గోదావరి నదులు అనుసంధానం జరుగుతుంది. ఏపీలోని నదులన్నింటినీ అనుసంధానించాలి. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు ఉండకూడదని అన్నారు
ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి… అన్ని మాట్లాడ్డం లేదు.. ఐక్యత గురించే మాట్లాడతాను. నీటి విషయంలోనైనా, సహకారం విషయంలోనైనా తెలుగువారంతా కలిసి ఉండాలి. ప్రపంచ మహాసభలకు హాజరైన ఉపాధ్యాయులకు ఆన్ డ్యూటీగా పరిగణిస్తాం. విలువలు నేర్పేది సంస్కృతి.. ఆ సంస్కృతి మూలం భాష.. అందుకే భాషాభివృద్ధికి నేను పూర్తి సహకారం ఇస్తాను. వివిధ దేవాలయాల్లో ఆస్థాన విద్వాంసులను, ఆస్థాన కవులను నియమించాలని కోరారు.. దానిపై నిర్ణయం తీసుకుంటాం. మాతృభాషాభివృద్ధికి, తెలుగు జాతి ఔన్నత్యానికి పూర్తిగా సహకరిస్తామని అన్నారు.



