Sunday, February 22, 2026

ఫ్యామిలీ జోన్ లో కామెడీ – ‘మన శంకర వర ప్రసాద్ గారు’.

- Advertisement -

ఫ్యామిలీ జోన్ లో కామెడీ – ‘మన శంకర వర ప్రసాద్ గారు’.

Comedy in the family zone – ‘Mana Shankara Vara Prasad Garu’.
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. సంక్రాంతి పండక్కి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో నటించగా.. నయనతార హీరోయిన్ గా నటించారు. ఇప్పటి వరకూ బయటకి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా తిరుపతిలో ట్రైలర్ లాంచ్ చేశారు. ఇన్నాళ్లూ మాస్ అంటే బాస్ అనేలా సినిమాలు చేసిన చిరు.. ఈసారి ఫ్యామిలీ జోన్ లోకి వచ్చి కామెడీ పండించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. రెండున్నర నిమిషాల మెగా ఫన్ రైడ్ ఎలా సాగిందంటే? విక్టరీ వెంకటేష్ స్పెషల్ క్యామియోలో నటిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. క్యాథరిన్ కీలక పాత్ర పోషిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా తిరుపతిలో నిర్వహించిన ఈవెంట్ లో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కొన్నేళ్లుగా మాస్ యాక్షన్ సినిమాలతో అలరిస్తూ వస్తున్న చిరంజీవి.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో ఫ్యామిలీని టార్గెట్ చేసినట్లు ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది. అలా అని పూర్తిగా యాక్షన్ ని పక్కన పెట్టకుండా.. అనిల్‌ రావిపూడి మార్క్‌ కామెడీ టచ్‌తో పాటు, మెగా అభిమానులు ఆశించే యాక్షన్‌ హంగులను కూడా జోడించారు.ఇంటలిజెంట్ బ్యూరో, రా ఏజెంట్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా చిరంజీవి పాత్రని పరిచయం చేశారు. వృత్తి పరంగా ఎలాంటి క్రిమినల్ని అయినా ఉతికి పిండి ఆరేసే శంకర వరప్రసాద్.. ఇంట్లో మాత్రం లుంగీ కట్టుకొని బట్టలు ఆరేస్తూ కనిపించారు. తప్పు చేసినోడిని కోసి కారం పెట్టే ఆయన, వంటింట్లో వంకాయలను కోసి కారం పెడుతున్నాడు. ఓవైపు ఫ్యామిలీ మ్యాన్ గా ప్రశాంతంగా కనిపిస్తూనే, మరోవైపు యాక్షన్ మోడ్ లో ఇరగదీస్తున్నాడు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్