మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ – మహబూబ్ నగర్ టూ టౌన్ పోలీస్

- Advertisement -

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్
– మహబూబ్ నగర్ టూ టౌన్ పోలీస్
మహబూబ్నగర్

Counseling for rowdy sheeters in the wake of municipal elections – Mahabubnagar Two Town Police
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా ముందస్తు చర్యలలో భాగంగా మహబూబ్నగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించినట్లు టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యజాజుద్దీన్ తెలిపారు.
టూ టౌన్ పోలీస్ స్టేషన్కు రౌడీషీటర్లను పిలిపించి, ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ యజాజుద్దీన్ మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో రౌడీషీటర్లు గానీ, ఇతర వ్యక్తులు గానీ శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే ప్రజల ప్రశాంతతకు విఘాతం కలిగించే ఎవరికైనా ఇదే విధమైన చట్టపరమైన చర్యలు అమలు చేయబడతాయని తెలిపారు.
ముందస్తు భద్రతా చర్యలలో భాగంగా సంబంధిత రౌడీషీటర్ల నుంచి ప్రతి ఒక్కరి వద్ద నుంచి రూ.1,00,000 (లక్ష రూపాయలు) విలువైన బాండ్ను సంబంధిత అధికారుల ఎదుట బంధపత్రంగా తీసుకోవడం జరిగిందని ఇన్స్పెక్టర్ యజాజుద్దీన్ వెల్లడించారు.
మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు శాంతియుతంగా, సజావుగా నిర్వహించడమే పోలీసు శాఖ లక్ష్యమని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని టూ టౌన్ ఇన్స్పెక్టర్ యజాజుద్దీన్ ప్రజలను కోరారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular