గద్వాల కాంగ్రెస్ లో గందరగోళం

- Advertisement -

గద్వాల కాంగ్రెస్ లో గందరగోళం
జోగులాంబ గద్వాల

Chaos in Gadwal Congress
గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొంది. రెండు వర్గాలకు  బీ ఫాంలు ఇవ్వడంతో వివాదం రేగింది.  జిల్లాలో ముందు నుంచి వున్న కాంగ్రెస్ నేతలకు  ఫిరాయింపు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మధ్య విభేదాలు గుప్పుమన్నాయి.గద్వాల మున్సిపాలిటీలో తన 36 మంది అనుచరులకు బీ ఫారంలు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అందచేసారు. మరోవైపు,  డీసీసీ ప్రెసిడెంట్ రాజీవ్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సరిత వర్గీయులకు 7 బీ ఫాంలు అందజేసారు. సరిత వర్గీయులకు బీ ఫారంలు ఇచ్చిన వార్డుల్లోనే, తన వర్గీయులకు కూడా బీ ఫాంలు  కృష్ణమోహన్ రెడ్డి  అందచేసారు. అధికారులు మాత్రం ముందుగా ఇచిన బీ ఫాం మాత్రమే చెల్లుబాటు అవుతుందని తేల్చి చెప్పారు.
దీంతో చివరి నిమిషంలో తమకు కృష్ణమోహన్ రెడ్డి అన్యాయం చేశాడని, అధిష్టానం మాటలు లెక్క చేయలేదని సరిత అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular