Wednesday, February 4, 2026

మంథని మాజీ శాసనసభ్యుడు చంద్రుపట్ల రాంరెడ్డి మృతి

- Advertisement -

మంథని మాజీ శాసనసభ్యుడు చంద్రుపట్ల రాంరెడ్డి మృతి

-ఈ నెల5న ముత్తారం మండలం సీతంపల్లిలోని వారి వ్యవసాయ క్షేత్రంలో జరగనున్న అంత్యక్రియలు

-సంతాపం ప్రకటించిన వివిధ పార్టీల నాయకులు, నియోజకవర్గ ప్రజలు

Former Manthani MLA Chandrapatla Ram Reddy passes away
మంథని
మంథని మాజీ శాసనసభ్యుడు చంద్రుపట్ల రాం రెడ్డి(80) అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఆయన మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే రాం రెడ్డి  పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామంలో 18 మార్చి1947లో చంద్రుపట్ల వెంకటరెడ్డి-అనసూయమ్మ దంపతులకు జన్మించారు. రాంరెడ్డికి ఇద్దరు కుమారులు ఆయన పెద్ద కుమారుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి తండ్రిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాలపై ఆసక్తితో విదేశాలలో ఉన్నత ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇప్పుడు బిజెపి మంథని నియోజకవర్గం ఇన్చార్జిగా,రాష్ట్ర నాయకుడిగా పనిచేస్తున్నారు. ఆయన చిన్న కుమారుడు అనిల్ రెడ్డి విదేశాల్లోనే స్థిరపడ్డాడు. రాంరెడ్డి ముత్తారం మండలం ఖమ్మంపల్లి సర్పంచ్ గా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి ముత్తారం ఎంపీపీగా, మంథని శాసనసభ్యునిగా ఎదిగారు. 1994 నుండి 1999వరకు తెలుగుదేశం పార్టీ తరపున మంథని శాసనసభ నియోజకవర్గం  నుండి రాంరెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు. తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రాంరెడ్డి, 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున మంథని శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుద్దిల్ల శ్రీపాద రావుపై 21,155 ఓట్ల మెజారిటీతో గెలుపొంది తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు. శ్రీపాదరావు మరణానంతరం 1999లో  జరిగిన ఎన్నికల్లో దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చేతిలో 15,271 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం తరువాత కెసిఆర్ ఆధ్వర్యంలో  తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి 2021 ఏప్రిల్ 3న  తన కుమారుడు చందుపట్ల సునీల్ రెడ్డితో కలిసి బిజేపిలో చేరాడు.
ముఖ్యంగా రైతుల కష్టాలు, గ్రామీణాభివృద్ధి అంశాలపై ఆయన చూపిన చిత్తశుద్ధి ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. పదవుల కంటే ప్రజలే ముఖ్యమని నమ్మిన నేతగా, రాజకీయాలకు మానవత్వాన్ని జోడించిన వ్యక్తిగా రాంరెడ్డి గుర్తుండిపోతారు. రైతు పక్షపాతిగా, ప్రజల మనిషిగా ఆయన సంపాదించిన గౌరవం అపారమైనది. మంచితనానికి మారుపేరుగా నిలిచిన ఆయన ఇక లేరన్న నిజం మంథని ప్రజలకు తీరని లోటుగా మారింది.
రామ్ రెడ్డి భౌతికకాయాన్ని బుధవారం మంథనికి తీసుకురానున్నారు. గురువారం ఉదయం అంతక్రియలను ముత్తారం మండలం సీతంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని వారి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్నారు. ఆయన చిన్న కుమారుడు అనిల్ రెడ్డి అనారోగ్యంతో ఉన్న తండ్రిని చూసి సోమవారం రాత్రి హైదరాబాదు నుండి అమెరికాకు బయలుదేరి వెళ్లారు. అంతలోనే మంగళవారం ఉదయం తండ్రి మృతి చెందడంతో మళ్లీ ఆయన అమెరికా నుండి తిరిగి హైదరాబాదుకు తిరిగి వచ్చిన తర్వాత  గురువారం అంత్యక్రియలు చేయనున్నారు. రాంరెడ్డి మృతి పట్ల నియోజకవర్గ ప్రజలు, వివిధ పార్టీల నాయకులు సంతాపం తెలియజేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్