Sunday, March 15, 2026

సాగునీటి సంఘాల అధ్యక్షులతో భారీ సమావేశం హజరు కానున్న చంద్రబాబు,పవన్ కళ్యాణ్

- Advertisement -

సాగునీటి సంఘాల అధ్యక్షులతో భారీ సమావేశం
హజరు కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
మంత్రి నిమ్మల రామానాయుడు
అమరావతి

Chandrababu, Pawan Kalyan to attend huge meeting with irrigation association presidents
జలవనరుల శాఖ ఆధ్వర్యంలో గురువారం  అమరావతిలో సాగునీటి సంఘాల అధ్యక్షులతో భారీ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి  ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హజరు కానున్నారని  మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.
మంత్రి మాట్లాడుతూ ఐదు ఏళ్ళ వైసిపి విధ్వంశ పాలనకు ఇరిగేషన్ వ్యవస్ధ గాడి తప్పింది. 18వేల కోట్ల రూపాయిల బిల్లుల బకాయిలను కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా ఇచ్చారని అన్నారు.
ఇరిగేషన్ శాఖను గాడిలో పెడుతూ, పోలవరం, హంద్రీనీవా, వెలిగొండ, గాలేరునగరి, పోలవరం ఎడమ ప్రధాన కాలువ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిపెట్టాం. ఖరీఫ్ పంట ముగిసినా రాయలసీమలో సైతం, రిజర్వాయర్లలో పుష్కలంగా నీరుందంటే చంద్రబాబు వాటర్ మేనేజ్ మెంట్ వల్లే సాధ్యమైంది. నాడు రాయల కాలంలో రాయలసీమ చెరువుల నిండితే, నేడు చంద్రబాబు పాలనలో రిజర్వాయర్లు, చెరువులు నిండుకుండల్లా ఉన్నాయి. ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టుకుని, భూమిని కూడా రిజర్వాయర్ లా మార్చుకోవాలని అన్నారు.
భూగర్భజలాలు పెంచుకోవాలని, కరువు రహిత రాష్ట్రంగా మార్చుకోవాలనేది చంద్రబాబు లక్ష్యం. నీటి భద్రత, వాటర్ మేనేజ్మెంట్, భూగర్భజలాల పెంపుపై సాగునీటి సంఘాలకు సిఎం చంద్రబాబు దిశా, నిర్దేశం చేయనున్నారని మంత్రి అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్