Friday, February 20, 2026

   గ్రూప్-1 నియామకాలు హైకోర్టు డివిజన్ బెంచ్ సక్రమమే: సిఎం రేవంత్ రెడ్డి హర్షం

- Advertisement -

తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు హైకోర్టులో ఊరట
       గ్రూప్-1 నియామకాలు హైకోర్టు డివిజన్ బెంచ్ సక్రమమే.
                               సిఎం రేవంత్ రెడ్డి హర్షం
హైదరాబాద్ ఫిబ్రవరి 5

Group-1 appointments by High Court Division Bench are legal: CM Revanth Reddy happy
తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్-1 నియామకాలు హైకోర్టు డివిజన్ బెంచ్ సక్రమమేనని తెలిపింది. గ్రూప్-1పరీక్షలపై తెలంగాణ విచారణ జరిపింది. గ్రూప్-1 పరీక్ష పారదర్శకంగానే జరగడంతో పాటు కింది కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. గ్రూప్1 పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని చెప్పడంతో పాటు నియామకాలపై సింగిల్ జడ్జి తీర్పును, గ్రూప్-1 జనరల్ ర్యాకింగ్ లిస్టును రద్దు చేసింది. మెయిన్స్ జవాబు పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలని సింగిల్ జడ్జి ఆదేశాలపై టిజిపిఎస్సి, ఎంపికైన అభ్యర్థుల అప్పీలుపై ధర్మాసనం తీర్పు నిచ్చింది. తుది తీర్పునకు లోబడి నియామకాలు చేపట్టవచ్చని గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 562 మందికి ప్రభుత్వం నియామక పత్రాలు ఇచ్చింది.
సిఎం రేవంత్ రెడ్డి హర్షం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి గ్రూప్-1 అధికారులు మీరే అని సిఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. గ్రూప్-1 అధికారులు రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితం కావాలని అన్నారు. గ్రూప్-1 పరీక్ష పారదర్శకంగానే జరగడంతో పాటు పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని హైకోర్టు తీర్పు ఇచ్చిన సందర్భంగా రేవంత్ రెడ్డి స్పందించారు. గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు తీర్పును ఆయన స్వాగతించారు. హైకోర్టు తీర్పునిచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ని కుట్రలు పన్నినా న్యాయ పోరాటంలో విజయం సాధించామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. 563 మంది గ్రూప్-1 అభ్యర్థులకు అభినందనలు తెలియజేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్