రేవంత్ ఒక జాతిని టార్గెట్ చేస్తున్నారు
కవిత
హైదరాబాద్
Revanth is targeting a caste
Kavitha
రాజకీయంగా ఎదుర్కొలేకనే వెలమ జాతిని సీఎం రేవంత్ టార్గెట్ చేశారు.అన్ని మర్యాదాలు అతిక్రమించి సీఎం మట్లాడటం సరైన పద్దతి కాదు. జగిత్యాల ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇవ్వటమంటే రాజ్యాంగాన్ని అవమానించటమేనని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు.
సంజయ్ కి నీతి, నిజాయితీ ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అన్నారు.
సీఎంగా ప్రమాణం చేసినప్పుడు ఏ బేధభావం లేకుండా అందరినీ గౌరవిస్తానని ప్రమాణం చేశారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజలకు మాటిచ్చారు. కానీ అవన్నీ మరిచి పోయి ఒక జాతిని టార్గెట్ చేయటం సరికాదు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకనే ఇలా ఒక జాతిపై విషం చిమ్ముతున్నారు. సీఎం తప్పకుండా ఇలాంటి వైఖరిని మార్చుకోవాల్సి ఉంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఆయన కాంగ్రెస్ లో చేరిన విషయం ప్రజలందరికీ తెలుసు. గాంధీ భవన్ లో అఫిషీయల్ గా మీటింగ్ లకు హాజరవుతున్నారని అన్నారు.
జగిత్యాలలో మున్సిపల్ అభ్యర్థులకు 30 మందికి కాంగ్రెస్ భీ ఫామ్ లు కూడా ఇచ్చారు. అలాంటి వ్యక్తికి స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వటం సరికాదు. రాజ్యాంగ పరంగా ఉన్న హక్కులను ఒక్కొక్కటి గా తుంగలో తొక్కటం…భవిష్యత్ తరాలకు మంచిది కాదు.వెంటనే స్పీకర్ తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నానని అన్నారు..



