Friday, February 20, 2026

పక్కా ప్లాన్ తో గులాబీ వ్యూహం

- Advertisement -

పక్కా ప్లాన్ తో గులాబీ వ్యూహం
హైదరాబాద్, ఫిబ్రవరి 5, (వాయిస్ టుడే )

A pink strategy with a solid plan
పురపోరుతో మళ్లీ గాడిన పడి పూర్వవైభవం దిశగా సాగాలని భారత రాష్ట్ర సమితి ఆశాభావంగా వెళ్తోంది. సర్పంచ్ ఎన్నికల ఫలితాల స్ఫూర్తితో పార్టీ గుర్తులతో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన స్థానాలు

దక్కించుకోవాలని గులాబీ పార్టీ భావిస్తోంది. బాకీ కార్డుల ద్వారా కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే పదేళ్ల కేసీఆర్ హయాంలో చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఎన్నికల ప్రచారం

నిర్వహించనున్నారు. ఇందుకోసం మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు పార్టీ తరపున సమన్వయకర్తలను కూడా నియమించారు. పెద్దపెద్ద సమావేశాలు, రోడ్ షోలు లేకుండా స్థానికంగానే ప్రచారం నిర్వహించాలని బీఆర్ఎస్

నిర్ణయించింది.వరుస ఎన్నికల్లో ఓటమితో ఇబ్బంది పడుతున్న భారత రాష్ట్ర సమితి ఇటీవలి పంచాయతీ ఎన్నికల ఫలితాలతో కాస్తా హుషారుగా కనిపిస్తోంది. సర్పంచ్ ఎన్నికల్లో నాలుగు వేలకు పైచిలుకు స్థానాలు పార్టీ

మద్దతు దారులు గెలుపు పొందారని అంటున్న బీఆర్ఎస్ అదే ఉత్సాహంతో పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దిగుతోంది. ఎన్నికలు జరుగుతున్న 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లలో మెరుగైన

సంఖ్యలో స్థానాలే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఎన్నికల సన్నాహాకాల్లో భాగంగా ఉమ్మడి జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులు, ఇన్చార్జులు పార్టీ జిల్లా అధ్యక్షులతో హరీశ్ రావు, కేటీఆర్లు సమావేశమయ్యారు.ఆయా పట్టణ

ప్రాంతాల్లో ఎన్నికల సన్నద్ధతను సమీక్షించి నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో గెలుపు ఆవశ్యకత గురించి వారికి పూర్తిస్థాయిలో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు పంచాయతీ ఎన్నికలే

నిదర్శనంగా బీఆర్ఎస్ అభివర్ణిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుందని సద్వినియోగం చేసుకుని పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికల వేళ చేరికలపై

కూడా గులాబీ పార్టీ దృష్టి సారించింది. స్థానికంగా మంచి పేరు, రాజకీయంగా బలం ఉన్న నేతలను పార్టీలో చేర్చుకుంటున్నార లోక్సభ ఎన్నికలకు ముందు పార్టీని వీడి బీజేపీలో చేరిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే

ఆరూరి రమేష్ మళ్లీ సొంతగూటికి వచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి ప్రతి ఒక్క వార్డులోనూ బరిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార పార్టీ ఒక్క వార్డును కూడా ఏకగ్రీవం చేసుకోకుండా చూడాలని

అధిష్టానం స్పష్టం చేస్తోంది. అభ్యర్థిత్వాల ఎంపిక విషయంలోనూ పూర్తి జాగ్రత్తగా ఉండాలని గెలుపే ప్రాతిపదికన ఖరారు చేయాలని దిశానిర్దేశం చేస్తోంది. ఒకరి కంటే ఎక్కువ సంఖ్యలో ఆశావహులు ఉన్నచోట అవకాశం

రాని వారిని బుజ్జగించి, రెబెల్స్కు ఆస్కారం లేకుండా చూసేందుకు ప్రణాళికలు వేస్తోందిఎన్నికలు జరుగుతున్న పురపాలికల్లో ప్రత్యేకంగా సమన్వయకర్తలను పార్టీ నియమించింది. ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ వారి

సమన్వయంతో జరిగేలా, క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు అధిష్టానానికి చేరవేసేలా ఈ ఏర్పాటు చేశారు. స్థానిక నేతలను సమన్వయం చేయడంతోపాటు అభ్యర్థుల ఎంపిక, నామినేషన్లు, ప్రచారం, వ్యూహం

లాంటి వాటిలో సమన్వయకర్తలు కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. బాకీ కార్డుల ద్వారా మున్సిపల్ ఎన్నికల ప్రచారం కొనసాగించాలని బీఆర్ఎస్ తీర్మానించింది. ఇందులోభాగంగా శాసనసభ ఎన్నికల వేళ కాంగ్రెస్

ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యాలు ప్రశ్నిస్తూ ఇంటింటికీ బాకీ కార్డులు పంపిణీ చేయనున్నారు. 25 నెలల కాంగ్రెస్ పాలనలో ఎవరికి ఎంత బాకీ పడ్డారో అందులో ముద్రించారుఇదే సమయంలో పదేళ్ల కేసీఆర్

హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు నాయకత్వం సూచించింది. పూర్తిగా జిల్లాస్థాయిలో ప్రచార కార్యక్రమాలు

చేపట్టనున్నారు. పెద్దపెద్ద సభలు, సమావేశాలు, రోడ్ షోలు లేకుండా ప్రతి ఓటరును కలిసేలా ఇంటింటి ప్రచారం నిర్వహించేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడం ద్వారా రానున్న

శాసనసభ ఎన్నికలకు మార్గం సుగమమం చేసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలన్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలంటే ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టాలని లక్ష్యంగా

పెట్టుకొంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్