Friday, February 20, 2026

 ప్రధానపార్టీలకు రెబల్స్ టెన్షన్

- Advertisement -

 ప్రధానపార్టీలకు రెబల్స్ టెన్షన్
అదిలాబాద్,  ఫిబ్రవరి 5, (వాయిస్ టుడే )

Rebels’ tension for major parties
మంచిర్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు అభ్యర్థుల్లో వేడిని రేకిత్తిస్తున్నాయి. జిల్లాలోని కార్పొరేషన్ తో పాటు నాలుగు మున్సిపాలిటీల్లోని 149 వార్డులకు 1061 మంది అభ్యర్థుల లో 368 మంది విత్ డ్రా కాగా

693 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. మరోవైపు ఇండిపెండెంట్ల రూపంలో ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద ఎక్కువగా ఉండటంతో ఒకింత ఆందోళనకు గురవుతున్నారు. ఓట్లు చీల్చితే ఇతరులకు లబ్ధి చేకూరే

అవకాశం ఉండటం తో రాత్రిళ్లు రెబల్స్‌ను బుజ్జగించి తమకు సఫో ర్టు చేయమని బతిమిలాడుతున్నారు. జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్, బెల్లంపల్లి, చెన్నూర్, క్యాతనపల్లి, లక్షెట్టిపేట మున్సి పాలిటీల్లోని 149

స్థానాలకు 1061 మంది అభ్యర్థులు 1177 నామినేషన్లు ఆమోదం పొం దాయి. మంగళ వారం బీ ఫారంల అందజేత, విత్ డ్రాల అనంతరం ప్రధాన పార్టీల నుంచి రెబల్ గా వేసిన అభ్యర్థులు, బీ ఫారంలు ఇవ్వని

అభ్యర్థులంతా ఇండిపెండెంట్లుగా బరి లో ఉన్నారు. ఇండిపెండెంట్ల సంఖ్య 135 నుంచి 168 (మంచిర్యాలలో 18 మంది, బెల్లంపల్లిలో 66, చెన్నూర్ లో 38, క్యాతనపల్లిలో 35, లక్షెట్టిపేటలో 11) కి పెరిగింది.ఈ

ఎన్నికలలో రెబల్స్ ప్రభావం అధికార పార్టీ అభ్య ర్థులపైన పడే అవకాశం ఎక్కువ ఉండనుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కార్పోరేషన్, మున్సిపాలిటీల్లో కాం గ్రెస్ నుంచి 148 మంది, బీఆర్‌ఎస్

నుంచి 139 మంది, బీజేపీ నుంచి 132, ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ (ఏఐఎఫ్బీ) నుంచి 28, బీఎస్పీ నుంచి 18, సీపీఐ నుంచి 17, జనసేన పార్టీ నుంచి 16,ఆప్ నుంచి తొమ్మిది, సీపీఎం నుంచి ఆరుగురు,

ఏఐఎంఎం నుంచి నలుగురు, ఇతర గుర్తింపు పొందిన పార్టీల నుంచి ఎనిమిది మంది పోటీ చేస్తుండగా ఇం డిపెండెంట్లు 168 మంది బరిలో నిలబడ్డారు. మంచిర్యాలలో 60 డివిజన్‌లు ఉండగా కేవ లం 18 మంది

ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తుండగా బెల్లంపల్లిలో అత్యధికంగా 66 మంది, చెన్నూర్‌లో 38, క్యాతనపల్లిలో 35, లక్షెట్టిపేటలో 11 మంది పోటీపడుతున్నారు.మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు 362

మంది నామినేషన్లు వేసి 122 మంది విత్ డ్రా చేసుకోగా 240 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 59 మంది, బీఆర్‌ఎస్ నుంచి 58, బీజేపీ నుంచి 58, ఆప్ నుంచి 8 మంది, బీఎస్పీ నుంచి

ఏడుగురు, ఏఐఎంఎం నుంచి రెండు, సీపీఎం నుంచి రెండు, ఏఐఎఫ్బీ నుంచి 18, సీపీఐ నుంచి ఒకరు, జనసేన నుంచి నలుగురు, ఇత ర  గుర్తింపు పొందిన పార్టీల నుంచి ఐదుగు రు, ఇండిపెండెంట్లు 18 మంది

అభ్యర్థులు పోటీలో ఉన్నారు.బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 34 వార్డులకు 252 మంది అభ్యర్థులు నామినేషన్ వేసి 79 మంది విత్ డ్రా అయ్యారు. ప్రస్తుతం పోటీలో 173 మంది ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 34

మంది అభ్యర్థులు, బీఆర్‌ఎస్ నుంచి 34, బీజేపీ నుంచి 20, బీఎస్పీ నుంచి ఆరుగురు, ఏఐఎంఎం నుంచి ఇద్దరు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) నుంచి ఒకరు, సీపీఐ నుంచి ఆరుగురు, జనసేన నుంచి

ఒక్కరు, ఇతర గుర్తింపు పొందిన పార్టీల నుంచి ముగ్గురు, ఇండిపెండెంట్లు 66 మంది బరిలో ఉండగా చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులకు 154 మంది అభ్యర్థుల నామినేషన్లు వేయగా 47 మంది

ఉపసంహరించుకోవడంతో 107 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.కాంగ్రెస్ నుంచి 18 మంది అభ్యర్థులు, బీఆర్‌ఎస్ నుం చి 18, బీజేపీ నుంచి 18, బీఎస్పీ నుంచి ఒకరు, సీపీఎం నుంచి ఒకరు, ఆల్ ఇండియా

ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) నుంచి ఐదుగురు, సీపీఐ నుంచి ముగ్గురు, జనసేన నుంచి నలుగురు, ఆప్ నుంచి ఒకరు, ఇండిపెండెంట్లు 38 మం ది పోటీలో ఉన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులకు

193 మంది అభ్యర్థులు నామినేషన్లు వేసి ఇందులో 80 మంది విత్ డ్రా కాగా 113 మంది పోటీలో ఉన్నారు.ఇందులో కాంగ్రెస్ నుంచి 22 మం ది, బీఆర్‌ఎస్ నుంచి 15, బీజేపీ నుంచి 22, బీఎస్పీ నుంచి ఇద్దరు,

ఏఐఎంఎం నుంచి రెండు, సీపీఎం నుంచి ఇద్దరు, ఏఐఎఫ్బీ నుంచి నలుగురు, సీపీఐ నుంచి ఏడుగురు, జనసేన నుంచి నలుగురు, ఇండిపెండెంట్లు 35 మంది అభ్యర్థులు, లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 15

వార్డులకు వంద మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా ఇందులో 40 మంది ఉపసంహరించుకోవడంతో 60 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.కాంగ్రె స్ నుంచి 15 మంది, బీఆర్‌ఎస్ నుంచి 14, బీజేపీ నుంచి

14, బీఎస్పీ నుంచి ఇద్దరు, ఏఐఎంఎం నుంచి రెండు, సీపీఎం నుంచి ఒకరు, జనసేన నుంచి ముగ్గురు, ఇండిపెండెంట్లు 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్