వృత్తి ధర్మం చాటుకున్న పోలీసులు.పోయిందనకున్న బ్యాగ్ దొరికింది.
కృతజ్ఞతలు తెలిపిన మహిళ
The police, who showed their professionalism, found the bag they thought was missing.
కూకట్‌పల్లి ప్రభుత్వ కళాశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్న మహిళ, అధికారిక కార్యక్రమంలో భాగంగా జగద్గిరిగుట్ట పరిధిలోని గాంధీ హైట్స్ వద్ద స్కూటీపై ప్రయాణిస్తున్న సమయంలో ఆమె తన హ్యాండ్ బ్యాగును పోగొట్టుకున్నారు. బ్యాగులో మొబైల్ ఫోన్ ఉండడంతో ఎవరైనా యూపీఐ ద్వారా అకౌంట్‌లోని నగదు విత్ డ్రా చేస్తారేమో అని ఆందోళన చెందారు.
ఇదే విషయమై ఆమె జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, వెంటనే స్పందించిన జగద్గిరిగుట్ట క్రైమ్ విభాగం పోలీసులు డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ పి. నరేందర్ రెడ్డి నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తక్కువ సమయంలోనే తన బ్యాగును గుర్తించి, బాధితురాలికి అప్పగించారు. అయితే బ్యాగ్ లోని మొబైల్ ఫోన్ తో సహా.. తన అకౌంట్‌లో నగదుతో పాటు ఇతర విలువైన వస్తువులన్నీ సురక్షితంగా ఉండటంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన జగద్గిరిగుట్ట పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.



