Sunday, March 22, 2026

12న ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ :ఎమ్మెల్సీ కవిత

- Advertisement -

12న ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్ ఫిబ్రవరి 7

Self-respect rally of activists on the 12th: MLC Kavitha
తెలంగాణ చరిత్రలో మాజీ సిఎం కెసిఆర్ కు ఒక పుస్తకమే ఉంటుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కెసిఆర్ చరిత్రను ఎవరూ చెరిపేయలేరని అన్నారు. హైదరాబాద్ లో జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 12న ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాలో మాట్లాడుతూ..కెసిఆర్ ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం సిఎం రేవంత్ రెడ్డికి లేదని, కెసిఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే రేవంత్ రెడ్డి తిడుతున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ సీరియల్ ఎప్పుడు పూర్తవుతుందో ప్రభుత్వం చెప్పాలని.. చిన్నచేప డిఎస్పి ప్రణీత్ రావుపై చర్యలు తీసుకున్నారని మండిపడ్డారు. ప్రణీత్ రావుకు ఆదేశాలిచ్చిన పెద్ద చేపలపై చర్యలు తీసుకోరా? అని కవిత ప్రశ్నించారు. పార్టీ ఏర్పాటు ప్రక్రియ 3 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందని తెలియజేశారు. పార్టీ ఆవిర్భావానికి మంచి ముహుర్తం కోసం చూస్తున్నామని, బిసిల అంశంలో బిఆర్ఎస్ ఏనాడు చిత్తశుద్ధితో వ్యవహరించలేదని ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ కు ఓటు వేయాలో.. వద్దో.. బిసిలు ఆలోచించుకోవాలని సూచించారు. తాను అసంబద్ధంగా మాట్లాడితే ప్రజలే ప్రశ్నిస్తారని, ఎవరు సమాధానాలు దాటవేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. పెద్ద నాయకులు బిఆర్ఎస్ పార్టీని గాలికి వదిలేశారా? అని కృష్ణార్జునులు రాష్ట్రమంతా ఎందుకు పర్యటించటం లేదని రాష్ట్రమంతా ప్రచారం చేయట్లేదంటే.. రాష్ట్రస్థాయి నేతలు కారా? అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ ప్రచారం అంత యాక్టివ్ గా లేదని, మున్సిపల్ ఎన్నికల గ్రౌండ్ లో బిఆర్ఎస్ నేతలు ఎవరూ లేరని చెప్పారు. బిఆర్ఎస్ పార్టీ ఇలాగే ఉంటే.. అధికారపార్టీ లడ్డూలా తన్నుకుపోతుందని, బిసి రిజర్వేషన్లపై బిఆర్ఎస్ తన విధానాన్ని స్పష్టంగా చెప్పలేదని కవిత అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్