Wednesday, February 11, 2026

6వ వార్డు ఎన్నికలు వాయిదా వేయాలి

- Advertisement -

6వ వార్డు ఎన్నికలు వాయిదా వేయాలి
మహదేవప్ప మృతికి మంత్రి శ్రీహరి బెదిరింపులే కారణం
ఎంపి డి కే ఆరుణ
మహబూబ్ నగర్

6th Ward elections should be postponed
సోమవారం నాడు  మక్తల్ మున్సిపాలిటీలో బ్రహ్మాండంగా ఎన్నికల ప్రచారం సభ జరిగింది. ఆ మరుసటి రోజే 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప  బలవన్మరణం చెందిన వార్త కలచివేసింది. మహాదేవప్ప మృతికి కారణం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీహరి. మంత్రి శ్రీహరి బెదిరింపులతోనే సూసైడ్ చేసుకున్నారని అర్థమౌతుందని ఎంపి డికే ఆరుణ ఆరోపించారు. అయన పోటీ చేయవద్దని బెదిరింపులకు దిగడంతో భయపడి చనిపోయారు. పోలీసులు తప్పుడు రిపోర్ట్ రాసి.. కుటుంబ సభ్యులకు చదివి వినిపించకుండానే సంతకం తీసుకున్నారు.
పోలీసులు ఆ రిపోర్ట్ లో.. ఓట్లు పడవనే భయంతో నా భర్త చనిపోయాడని మహదేవప్ప భార్య చెప్పినట్లు రాసి.. ఆమె సంతకం తీసుకోవడం జరిగిందని ఆమె అన్నారు.
ఇంతకన్నా ఘోరం ఇంక ఏం ఉంటుంది ?
మృతదేహాన్ని పక్కన పెట్టుకొని, అంత త్వరగా రిపోర్ట్ రాయించుకోవాల్సిన అవసరం పోలీసులకు ఏం వచ్చింది ?  బెదిరింపులకు గురి చేసి మహాదేవప్ప మరణానికి సీఎం, మంత్రి కారణం అయితే.. పోలీసులను తప్పుదోవ పట్టించే విధంగా అధికారులు ప్రయత్నం చేసారు.  ఇక్కడి అధికారులపై నమ్మకం లేదు. మంత్రికి, ముఖ్యమంత్రికి  అధికారులు పూర్తిగా తొత్తులుగా మారారు. వారిని వెంటనే సస్పెండ్ చేయాలని, ఇక్కడి అధికారులను ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.  ఈ వార్డు ఎన్నికను పోస్ట్ పోన్ చేసి.. తర్వాత ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం. ఇక్కడి అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్