మలక్ పేట లో ట్రాఫిక్ సేఫ్టీ అవగాహనా కార్యక్రమం
హైదరాబాద్
Traffic safety awareness program in Malakpet
నేషనల్ రోడ్డు సేఫ్టీ – ట్రాఫిక్ పోలీసుల అవగాహనా కార్యక్రమంలో భాగంగా నేషనల్ రోడ్డు సేఫ్టీ సందర్భంగా మలక్ పేట్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యత, అలాగే మనిషి విలువైన జీవితం గురించి ప్రత్యేకంగా చర్చించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ సిగ్నల్స్ను కచ్చితంగా పాటించాలి. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపకూడదు. సీట్బెల్ట్ ధరించడం తప్పనిసరి. మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరం. ఓవర్ స్పీడ్, సెల్ ఫోన్ వినియోగం ప్రమాదాలకు దారి తీస్తాయని అన్నారు.
ట్రాఫిక్ నియమాలు మన భద్రత కోసమే రూపొందించబడ్డాయి. ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి కారణమవుతుంది. కుటుంబ సభ్యులు మన కోసం ఎదురుచూస్తుంటారు — కాబట్టి సురక్షితంగా ఇంటికి చేరుకోవడం మన బాధ్యత. డబ్బు, వస్తువులు తిరిగి సంపాదించవచ్చు. కానీ ఒకసారి కోల్పోయిన ప్రాణం తిరిగి రాదు. ప్రతి వాహనదారుడు తన ప్రాణాన్ని, ఇతరుల ప్రాణాలను గౌరవించాలి. ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు పాంప్లెట్లు పంపిణీ చేసి, రూల్స్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమం లో మలక్ పేట్, సైదాబాద్ ఏసీపీ, ఇన్సి పెక్టర్స్, ట్రాఫిక్ పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.



