హంగ్ మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ ప్రత్యేక నజర్
– ఎనిమిది పట్టణాలకు సీనియర్ నేతలను ఇన్ఛార్జులుగా నియామకం
– – కాంగ్రెస్ ను అడ్డుకుని, ఎన్నిక సాఫీగా నిర్వహించుకోవడమే లక్ష్యం
– స్థానిక పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో మాట్లాడిన కేటీఆర్
హైదరాబాద్
BRS special focus on Hung Municipalities
హంగ్ మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ ప్రత్యేక నజర్ వేసింది. అధికార కాంగ్రెస్ పార్టీ ని అడ్డుకునేందుకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అప్రమత్తమైంది. రేపు ఎన్నికలు జరగనున్న కీలకమైన హంగ్ మున్సిపాలిటీల కోసం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా ఎన్నికల ఇన్ఛార్జిలను నియమించారు. ఈ మేరకు ఆయా మున్సిపాలిటీల స్థానిక నాయకత్వం, నియోజకవర్గ ఎమ్మెల్యేలు మరియు ఇన్ఛార్జులతో స్వయంగా మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు.
స్థానిక నాయకత్వానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. స్థానిక నాయకత్వానికి అన్ని విధాలా అండగా నిలబడేందుకు, ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు పార్టీ తరఫున సీనియర్ నాయకులను ప్రత్యేక ఇన్ఛార్జులుగా పంపుతున్నట్లు ప్రకటించారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నేతలు వెంటనే తమకు కేటాయించిన మున్సిపాలిటీలకు బయలుదేరి వెళ్లారు.



