అర్హులైన జర్నలిస్టులందరికీ  జి ఓ ఎం ఎస్ నెం. 252 ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు జారీ :స్పెషల్ కమిషనర్   సిహెచ్. ప్రియాంక

- Advertisement -

అర్హులైన జర్నలిస్టులందరికీ  జి ఓ ఎం ఎస్ నెం. 252 ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు జారీ
        సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్   సిహెచ్. ప్రియాంక
హైదరాబాద్, ఫిబ్రవరి 18

All eligible journalists will be issued accreditation cards as per G.O.M.S. No. 252: Special Commissioner Ch. Priyanka
రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ  జి ఓ ఎం ఎస్ నెం. 252 ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు జారీ  చేయడం జరుగుతుందని సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్   సిహెచ్. ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా  ప్రింట్, ఎలక్ర్టానిక్, డిజిటల్, ఫ్రీ ల్యాన్సర్ మరియు వెటరన్ జర్నలిస్టులు అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సమాచార శాఖ ప్రత్యేక వెబ్ సైట్ ను రూపొందించామన్నారు.ipr.telangana.gov.in వెబ్ సైట్ లో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.ఈ నెల 9వ తేదీ నుండి దరఖాస్తు లను ఆన్లైన్ లో తీసుకోవడం జరుగుతుందన్నారు. అక్రిడిటేషన్ దరఖాస్తు మరియు జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, దరఖాస్తు చేసుకునే సమయంలో ఏదైన టెక్నికల్ సమస్యలు ఉత్పన్నమైతే సమాచార శాఖ మీడియా రిలేషన్ విభాగంలో ఈ నెంబర్ 9154170881కు కార్యాలయం పని వేళలో ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటలలో సంప్రదించవచ్చునని ఆమె ఆ ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular