ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ – 2026లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
వివిధ సంస్థలతో ఒప్పందాలు
న్యూఢిల్లీ
Chief Minister Chandrababu Naidu participating in India AI Impact Summit – 2026
ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరుగుతున్న ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హజరయ్యారు. ఈ సదస్సుకు న ప్రపంచ క్వాంటం-ఏఐ రంగాలకు చెందిన దిగ్గజ సంస్థల ప్రతినిధులు హజరయ్యారు. ఈ సదస్సులో ఐబీఎం సహా వివిధ ప్రముఖ సంస్థలతో సీఎం చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఏపీలో క్వాంటం-ఏఐ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి, మౌళిక వసతుల అభివృద్ధి కల్పించే దిశగా ఏడు ఒప్పందాలు జరిగాయి. ఏపీని క్వాంటం-ఏఐ హబ్ గా తీర్చిదిద్దడం… అమరావతిలోని క్వాంటం వ్యాలీకి జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చేలా ఎంఓయూలు జరిగాయి.
భవిష్యత్ టెక్నాలజీని అందిపుచ్చుకునేలా విద్యార్థులు, యువతకు ఏఐ-క్వాంటం రంగాల్లో శిక్షణ, ప్రభుత్వ శాఖల్లో ఏఐ-క్వాంటం వినియోగం, టెక్నాలజీ ద్వారా ప్రజలకు సేవలను సులభతరం చేయడం వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది.
క్వాంటం, ఏఐలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసేందుకు యూనైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్ (UNICC), * క్వాంటం, ఏఐ, సైబర్ సెక్యూరిటీలో రాష్ట్రంలోని 1 లక్ష మంది యువతకు శిక్షణ ఇచ్చేలా ఐబీఎంతో, ఏపీలో క్వాంటం ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుపై నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ-NIELITతో, * రాష్ట్ర స్థాయి ఏఐ టెక్ హబ్-5 లేయర్డ్ స్వదేశీ ఏఐ స్టాక్ నిర్మించేలా భారత్ జెన్-నెక్స్ జెన్-ఐబీఎంలతో ఒప్పందాలు జరిగాయి.



