2026-27 సంవత్సరానికి జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ

- Advertisement -

 2026-27 సంవత్సరానికి జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ
నంద్యాల
Distribution of accreditation cards to journalists for the year 2026-27
జిల్లా కలెక్టర్ & జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ రాజకుమారి గణియా

నంద్యాల, ఫిబ్రవరి 25
2026 -27 సంవత్సరానికి గాను జిల్లాలోని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అక్రిడిటేషన్ కార్డులను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ జి. రాజకుమారి బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో అందజేశారు.

జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ తొలి సమావేశంలో ఆమోదం పొందిన మొత్తం 508 మంది పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న మిగిలిన పాత్రికేయుల అర్హతలను పరిశీలించి, తదుపరి కమిటీ సమావేశంలో వారికి కూడా మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. మొదటి జాబితాలో ఆమోదం పొందిన పాత్రికేయులు సంబంధిత డీఐపీఆర్ఓ కార్యాలయం నుండి తమ అక్రిడిటేషన్ కార్డులను స్వీకరించి, ప్రభుత్వం కల్పించిన ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఐపీఆర్ఓ, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular