భారీ విస్తరణ దిశగా ఓయో
హైదరాబాద్, ఫిబ్రవరి 26, (వాయిస్ టుడే )
Oyo on the verge of massive expansion
ఓయో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తన వ్యాపార విస్తరణను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మొత్తం 300 కంపెనీ సర్వీస్డ్ హోటళ్లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించింది.
ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం నగరాలను ప్రధాన లక్ష్యంగా ఎంపిక చేసింది. హైదరాబాద్‌లో నిర్వహించిన హోటల్ భాగస్వాముల సదస్సులో ఈ కీలక ప్రకటన వెలువడింది. వేగంగా అభివృద్ధి
చెందుతున్న పట్టణ కేంద్రాలు, టియర్-2 నగరాల్లో తమ బలమైన ఉనికిని ఏర్పరచుకోవడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా సంస్థ వెల్లడించింది.హైదరాబాద్‌లో అభివృద్ధి చెందుతున్న మెడికల్, బిజినెస్ టూరిజం రంగాల వల్ల
ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. అదే సమయంలో ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలైన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం ప్రాంతాలకు వచ్చే భక్తుల సంఖ్య
కూడా గణనీయంగా పెరుగుతోంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని సంస్థ తన విస్తరణ వ్యూహాన్ని రూపొందించింది. ఇక ఏపీలో వైజాగ్ సహా విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో ప్రీమియం హోటల్స్ సంఖ్యను
పెంచేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.సరఫరా పెంపు, హోటళ్ల నాణ్యత ప్రమాణాల మెరుగుదల, అతిథులకు మెరుగైన సేవల అందుబాటు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన అభివృద్ధి ప్రణాళికను సంస్థ
ప్రకటించింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలు, మెరుగైన విమాన సౌకర్యాలు వంటి కారణాల వల్ల తెలంగాణ దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న హాస్పిటాలిటీ మార్కెట్‌గా
మారుతోంది.ఈ సందర్భంగా OYO మాతృసంస్థగా పేర్కొన్న సంస్థ) రీజినల్ హెడ్ (సౌత్ సెంట్రల్,ఈస్ట్) అయిన ఆశిష్ సౌరభ్ మాట్లాడుతూ, తెలంగాణ హాస్పిటాలిటీ రంగం నిర్మాణాత్మకంగా బలంగా ఉందన్నారు.
హైదరాబాద్ వంటి వ్యాపార కేంద్రాలు స్థిరమైన కార్పొరేట్ డిమాండ్‌ను అందిస్తుండగా, మెరుగైన కనెక్టివిటీ కొత్త లీజర్ టూరిజం అవకాశాలను తెరుస్తోందని తెలిపారు. అతిథులకు మరింత విశ్వసనీయమైన సేవలను
అందించే బలమైన నెట్‌వర్క్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు.ఈ సమగ్ర వ్యూహం భాగస్వాములకు దీర్ఘకాలిక లాభాలను అందించడమే కాకుండా, ప్రయాణికులకు స్థిరమైన నాణ్యతతో కూడిన సేవలను అందించడాన్ని
లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయ పర్యాటకం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో హోటల్ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు



