మావోయిస్టుల కండిషన్స్…

- Advertisement -

మావోయిస్టుల కండిషన్స్…
హైదరాబాద్, ఫిబ్రవరి 27, (వాయిస్ టుడే )

Conditions of the Maoists…
దేశంలో మావోయిస్టు పార్టీ తుది దశకు చేరుకుంది. అగ్ర నాయకులు ఒకరి తర్వాత ఒకరు.. లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీ పరిస్థితి దారుణంగా మారింది. 1967లో పశ్చిమ బెంగాల్ లోని, నక్సల్ బరీలో పుట్టిన

మావోయిస్టు ఉద్యమం.. ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టులు లొంగిపోవడం లేదా చచ్చిపోవడమో అన్నట్లుగానే, గత రెండు.. మూడు ఏళ్ల నుంచి కాలం

గడుపుతూ వస్తున్నారు.ఇక తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టులకు అండగా నిలబడటంతో.. పెద్ద ఎత్తున కీలక మావోయిస్టు నాయకులందరూ తెలంగాణ వచ్చి లొంగిపోయే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న దేవ్ జి బడే

చొక్కారావు, నూనె నరసింహారెడ్డి, మల్లా రాజిరెడ్డి వంటి వారు తెలంగాణ డిజిపి ఎదట లొంగిపోయారు. దీనితో ఇప్పుడు మావోయిస్టు పార్టీ కీలక నేత గణపతి ఎక్కడున్నారు అనే దానిపైనే చర్చ జరుగుతోంది. గణపతి

ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో నేపాల్ లో ఉన్నట్లుగా భావిస్తున్నారు.2018 లో పార్టీ బాధ్యతలను నంబాలకు అప్పగించిన తర్వాత ఆయన.. ఒడిస్సా మీదుగా బీహార్ చేరుకుని అక్కడి నుంచి నేపాల్ వెళ్ళినట్లు

భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన తెలంగాణ పోలీసులతో చర్చలు కూడా జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తనను కేంద్ర బలగాలకు అప్పగించోద్దని.. ఆయన షరతు విధించినట్లు సమాచారం. దశాబ్దాల పాటు

మావోయిస్టు ఉద్యమాన్ని ముందుండి నడిపించారు గణపతి. ప్రస్తుతం అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉన్న ఆయన, బీహార్ మీదగా నేపాల్ వెళ్లిపోయినట్లు సమాచారఆయన కూడా లొంగిపోతే దేశంలో మావోయిస్టు

పార్టీ పూర్తిగా అంతిమ దశకు చేరుకున్నట్లే. తెలంగాణకు చెందిన మరి కొంతమంది నేతలు ప్రస్తుతం.. ఝార్ఖండ్ ప్రాంతంలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. గణపతి కోసం అటు కేంద్ర బలగాలు కూడా ప్రయత్నాలు

చేస్తున్నాయి. ఇక మావోయిస్ట్ లలో మరో కీలక నేత నరహరి ఎక్కడ ఉన్నారు అనే దానిపై బలగాలు పెద్ద ఎత్తున గాలిస్తున్నాయి

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular