జై ఆంధ్ర అని నినదించిన కవిత

- Advertisement -

జై ఆంధ్ర అని నినదించిన కవిత
తిరుమల

A poem that chants the slogan Jai Andhra
త్వరలో తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించినట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం అనంతరం శుక్రవారం   తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత  తిరుమలలో మీడియాతో మాట్లాడారు. తనపై ఉన్న కేసుల నుంచి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినందుకు కృతజ్ఞతగా, మొక్కు తీర్చుకోవడానికి అలిపిరి నడక మార్గం ద్వారా తిరుమల కు వచ్చినట్లు కవిత తెలిపారు.
త్వరలో తెలంగాణాలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. “తెలంగాణ జాగృతి” ఆధ్వర్యంలో ఈ పార్టీని స్థాపించనున్నట్లు తెలిపారు. పూర్తిగా తెలంగాణ  అస్తిత్వాన్ని కాపాడేలా తమ కొత్త పార్టీ నినాదం ఉంటుందన్నారు. అది “తెలంగాణ ఫస్ట్” అని వెల్లడించారు. కుల, మత, వర్గ భేదాలు లేకుండా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమని చెప్పారు.
బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు
తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారంలో, ప్రతిపక్ష పాత్ర పోషించడంలో బీఆర్ఎస్ మరియు బీజేపీలు విఫలమయ్యాయని విమర్శించారు. గత నాలుగేళ్లుగా చేయని తప్పుకు తాను, తన కుటుంబం మానసిక వేదన అనుభవించామని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేసిన న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు తెలిపారు.
తిరుపతిలో జై ఆంధ్ర” నినాదం :
తిరుపతి పర్యటనలో ఆమె “జై ఆంధ్ర” అని నినదించడం చర్చనీయాంశమైంది. తమకు ఆంధ్ర ప్రజలపై ద్వేషం లేదని, కేవలం రాజకీయ ఆధిపత్యాన్నే వ్యతిరేకించామని స్పష్టం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular