Saturday, April 4, 2026

హుజురాబాద్ నియోజకవర్గం సమస్యలు పరిష్కరించండి : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

- Advertisement -

హుజురాబాద్ నియోజకవర్గం సమస్యలు పరిష్కరించండి
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సమావేశం లో పాల్గొన్న  ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
పెండింగ్ పనులతో పాటు అభివృద్ధి పనులు చేపట్టాలని వినతి
హుజరాబాద్

Solve the problems of Huzurabad constituency: MLA Padi Kaushik Reddy
నియోజకవర్గం లోని అన్ని రకాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజురాబాద్ నియోజకవర్గం లోని వీణవంకకు రోడ్ల కోసం 30 కోట్లు మంజూరు చేసి ఉందని, ఆ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని ఆర్ అండ్ బి అధికారులకు చెప్పి వెంటనే పనులు పూర్తయ్యేలా చూడాలని అన్నారు. కలువల ప్రాజెక్టు కింద సుమారు 8 ఎకరాల సాగు ఉందని 18 వేల కోట్లతో పూర్తిస్థాయిలో కలువల ప్రాజెక్ట్ నిర్మిస్తే కొన్ని వందల సంవత్సరాలు రైతులకు ఇబ్బంది కాకుండా ఉంటుందని వెంటనే పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే హుజరాబాద్ లో మినీ స్టేడియం కోసం పది కోట్లు బిఆర్ఎస్ ప్రభుత్వంలో టెండర్ పిలిచామని సుమారు 20% పనులు కూడా పూర్తయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని మభ్యంతరంగా ఆపివేశారని వెంటనే స్టేడియం పనులు పూర్తిచేస్తే ఇక్కడ క్రీడాకారులకు చాలా ఉపయోగకరంగా ఉండడంతో పాటు వాకర్స్ కూడా ఉపయోగంగా ఉంటుందన్నారు. హుజురాబాద్ జమ్మికుంట పట్టణాలలో వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా కూడా చూసుకోవాలని అన్నారు. జమ్మికుంటలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ ల కొరత ఉందని వెంటనే గైనకాలజిస్ట్లను తీసుకువస్తే పేద ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుందన్నారు. హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసియు అన్ని విధాల సిద్ధంగా ఉందని కేవలం రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. కమలాపూర్ లో బస్టాండ్ ఒక కోటి 70 లక్షల తో నిర్మాణం జరిగిందని, ఇంకో కోటిన్నర కేటాయిస్తే పూర్తిస్థాయిలో బస్టాండ్ నిర్మాణం జరుగుతుందన్నారు. సిర్సపల్లి డంపింగ్ యార్డ్ ప్రతిపాదన వల్ల హుజురాబాద్ అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని, డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్య పాలవుతారని వెంటనే ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని అన్నారు.   ఇల్లంతకుంట మండలంలో కూడా పోలీస్ స్టేషన్ తో పాటు ఎంపీడీవో కార్యాలయం ఎమ్మార్వో కార్యాలయం లేదని వాటికి కూడా నిధులు కేటాయిస్తే పూర్తి అవుతుందన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్