తెలంగాణ గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం

- Advertisement -

తెలంగాణ గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం

హైదరాబాద్, మార్చి 11 (వాయిస్ టుడే న్యూస్):

Shiv Pratap Shukla Sworn in as Telangana Governor

Shiv Pratap Shukla Sworn in as Telangana Governor
Shiv Pratap Shukla Sworn in as Telangana Governor

తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేశ్ కుమార్ సింగ్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు వివిధ రాజకీయ పార్టీల సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు (IAS), డీజీపీ శివధర్ రెడ్డి (IPS)తో పాటు పలువురు సీనియర్ ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

లోక్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో శివ ప్రతాప్ శుక్లా తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం ప్రత్యేకంగా నిలిచింది. కార్యక్రమం అనంతరం రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం తాను కట్టుబడి పనిచేస్తానని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తెలిపారు.

 

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular