Thursday, March 12, 2026

ఈనెల 22 న  ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్నసీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

ఈనెల 22 న  ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్నసీఎం రేవంత్ రెడ్డి

హుస్నాబాద్
ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ఈనెల 22 న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని

రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు

హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో వ్యవసాయ యాంత్రికీకరణ  పథకంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ మండలాలకు చెందిన 38 మంది రైతులకు 53 లక్షల 80 వేల రూపాయల విలువైన 36 రోటోవేటర్లు,2 స్ట్రాబెలర్స్ గడ్డిని కట్టకట్టే యంత్రాలు, వ్యవసాయ పరికరాలను  50% సబ్సిడీతో పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ. రైతులకు శ్రమను తగ్గించి అధిక దిగుబడులను సాధించేందుకు అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రికరణ పథకం ద్వారా వ్యవసాయ పనిముట్లను తీసుకోవాలని  రైతులకు సూచించారు. ఈనెల 22 న నంగునూరు మండలం నర్మెట్టలో నూతనగా నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని..ఈ సందర్భంగా మూడు రోజులపాటు రైతు మేళా నిర్వహించి వ్యవసాయ పనిముట్లను ప్రదర్శించడం జరుగుతుందని రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. రెండు, మూడు రోజుల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి సీఎం పర్యటన కోసం ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని పరిశీలిస్తామని తెలిపారు. వ్యవసాయంలో క్షేత్రస్థాయిలో అధికంగా ఉపయోగపడే చిన్నచిన్న పరికరాలను గతంలో రైతులకు అందించలేదని ఇప్పుడు అందిస్తున్నామని అన్నారు. అదేవిధంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎస్సీ,ఎస్టీ కాంపోనెంట్ కింద ఇంకా వ్యవసాయ పరికరాలను అందించేందుకు వీలుందని  దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు రైతులను యాత్రికరణలో భాగంగా వ్యవసాయ పరికరాలను తీసుకునేందుకు ప్రోత్సహించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి,  హుస్నాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ,  ఆత్మ కమిటీ చైర్మన్ ఐలయ్య, జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కోహెడ మార్కెట్ కమిటీ చైర్మన్, వ్యవసాయ అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్