నిజాం వారసుల ఆస్తులు 10వేల కోట్లు..
హైదరాబాద్, మార్చి 12 (వాయిస్ టుడే )
The assets of the Nizam’s heirs amount to ₹10,000 crore.
హైదరాబాద్‌ను ఏలిన ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వారసుల మధ్య దశాబ్దాలుగా సాగుతున్న ఆస్తుల యుద్ధం ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగింది. సుమారు 400 మందికి పైగా ఉన్న నిజాం వారసుల మధ్య గతంలో తీవ్రమైన విభేదాలు, కోర్టు కేసులు ఉన్నప్పటికీ, ఇటీవలి కాలంలో వారంతా ఒక ఉమ్మడి అవగాహనకు వచ్చారు. కోర్టు వారికి రూ. పది వేలకోట్ల ఆస్తులపై హక్కులు ఇచ్చింది. ఇప్పుడు వీరంతా ఈ ఆస్తుల్ని పంచుకోనున్నారు.నిజాం మరణం తర్వాత ఆయన అపారమైన సంపదపై హక్కుల కోసం వారసుల మధ్య సుదీర్ఘ పోరాటం సాగింది. అయితే, కాలక్రమేణా న్యాయపోరాటాల వల్ల ఎవరికీ ప్రయోజనం లేదని గుర్తించిన వారసులు, ఒకే తాటిపైకి వచ్చి చర్చలు జరుపుతున్నారు. తమ వాటాల ప్రకారం ఆస్తిలో భాగం లేదా తగిన పరిహారం తీసుకునేలా ఒక ఫార్ములాను వారు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఫలక్‌నుమా, చౌమహల్లా వంటి రాజభవనాలు ఈ ఆస్తుల జాబితాలో ఉన్నాయి.నిజాం ఆస్తులు ఆయన వ్యక్తిగతం కావని కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే కోర్టు నిజాం కుటుంబానికే చెందుతాయని స్పష్టం చేయడంతో, ఆస్తుల అమ్మకం, అభివృద్ధిపై ఉన్న చట్టపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఈ తీర్పు ఆధారంగా వారసులందరికీ వారి వాటాలను పక్కాగా లెక్కగట్టే అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా నిజాం ట్రస్టుల పరిధిలో ఉన్న భూములు, భవనాలను విక్రయించి వచ్చే ఆదాయాన్ని అందరికీ సమానంగా పంచే ప్రక్రియ ఇప్పుడు ఊపందుకోనుందిహైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఖరీదైన భూములు, చారిత్రక భవనాల విలువ నేడు వేల కోట్లకు చేరుకుంది. కేవలం ప్యాలెస్‌లు మాత్రమే కాకుండా, వివిధ ప్రాంతాల్లో ఉన్న నిజాం ఆస్తుల విక్రయం ద్వారా వచ్చే నిధులను 400 మందికి పైగా ఉన్న వారసులకు పంపిణీ చేయడం ఒక పెద్ద టాస్క్. అయితే, వారసులందరూ ఏకాభిప్రాయానికి రావడంతో, ఈ పంపిణీ ప్రక్రియలో గందరగోళం తగ్గే అవకాశం ఉంది. నిజాం వారసుల మధ్య కుదిరిన ఈ అవగాహన కేవలం ఆస్తుల పంపిణీకే పరిమితం కాకుండా, నిజాం వారసత్వాన్ని కాపాడటంపై కూడా దృష్టి సారిస్తోంది. చౌమహల్లా వంటి ప్యాలెస్‌లను పర్యాటక కేంద్రాలుగా కొనసాగిస్తూనే, ఇతర వాణిజ్య ఆస్తుల ద్వారా లబ్ధి పొందాలని వారు భావిస్తున్నారు.



