Saturday, March 14, 2026

 చిన్నప్పటి నుంచి సినిమాలంటు ఇష్టం

- Advertisement -

 చిన్నప్పటి నుంచి సినిమాలంటు ఇష్టం
హైదరాబాద్, మార్చి 13

హైదరాబాద్‌ను గ్లోబల్ కంటెంట్ హబ్‌గా మార్చే దిశగా మరో భారీ అడుగు పడింది. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ తన ‘ఐలైన్ స్టూడియోస్’ గ్లోబల్ విజువల్ ఎఫెక్ట్స్, వర్చువల్ ప్రొడక్షన్ హబ్‌ను హైటెక్ సిటీలో ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు.విశ్వ నగరంగా మారుతున్న హైదరాబాద్‌కు ప్రపంచ స్థాయి సంస్థలు క్యూ కడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో ఉన్న మౌలిక సదుపాయాలు, ప్రభుత్వాల ప్రోత్సాహకాలు, అనువైన పరిస్థితులు, మానవ వనరులు సహా ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. దీంతో ఎన్నో గ్లోబల్ కంపెనీలు.. హైదరాబాద్‌లో తమ బ్రాంచ్‌లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా.. విదేశీ వేదికలపై హైదరాబాద్ నగరానికి ఉన్న అవకాశాలను వివరిస్తూ.. ఆయా కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్ వచ్చిందిఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌ సంస్థను హైదరాబాద్‌కు ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. హైటెక్‌సిటీలోని నెట్‌ఫ్లిక్స్‌ ఐలైన్‌ స్టూడియోస్‌ ఆఫీస్‌ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. నెట్‌ఫ్లిక్స్ సంస్థకు హైదరాబాద్‌ నగరం అన్ని రకాల అవకాశాలను కల్పిస్తుందని తెలిపారు. అదే సమయంలో తమ ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ హైదరాబాద్‌కు వచ్చిందంటే హాలీవుడ్‌ మన నగరానికి వచ్చినట్లేనని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తమ దృష్టి హాలీవుడ్‌పైనే ఉందని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి.. నెట్‌ఫ్లిక్స్‌ రాకతో తన కల నిజం కాబోతుందని ఆనందం వ్యక్తం చేశారు.తాను బాల్యంలో ఉన్నప్పటి నుంచే తనకు సినిమాలు అంటే ఎంతో ఇష్టమని తెలిపిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కార్యాలయాన్ని తన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమా రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని.. బాహుబలి, కల్కి, ఆర్‌ఆర్‌ఆర్‌, అరుంధతి వంటి సినిమాలను తీశారని పేర్కొన్నారు. మద్రాకు కేంద్రంగా ఉన్న సినిమా ఇండస్ట్రీని ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర్ రావు.. హైదరాబాద్‌కు తీసుకువచ్చారని గుర్తు చేశారు. కాలంతో పాటు సినీ ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు వచ్చాయని తెలిపారు.నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు విశాలమైన ఆఫీస్ నిర్మించుకునేందుకు కావాల్సిన భూమిని.. కొత్తగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి తమ ప్రభుత్వం రెడీగా ఉందని రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఫ్యూచర్ సిటీకి నెట్‌ఫ్లిక్స్‌ కార్పొరేట్ ఆఫీస్‌ను తీసుకురావాలని కోరుతున్నట్లు చెప్పారు. ప్రపంచంలో ఉన్న 500 పెద్ద కంపెనీలను.. తెలంగాణకు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడి పెడితే పూర్తి రక్షణ ఉంటుందని సీఎం హామీ ఇచ్చారుఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ… హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్ రావడం అంటే సాక్షాత్తు హాలీవుడ్ ఇక్కడికి వచ్చినట్లే అని అన్నారు. నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి పనిచేయాలనే తన కల నేడు నిజమైందని సంతోషం వ్యక్తం చేశారు. నెట్‌ఫ్లిక్స్ సంస్థకు ఇది ఇండియాలో రెండో కార్యాలయం అని చెప్పారు. ఫోర్త్ సిటీగా పిలుస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’లో నెట్‌ఫ్లిక్స్ కార్పొరేట్ కార్యాలయం ఏర్పాటుకు కావాల్సిన భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని… ఈ సంస్థకు తమ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు. తెలంగాణ అంటేనే బిజినెస్ అని, ఇక్కడ పెట్టుబడులకు పూర్తి రక్షణ ఉంటుందని భరోసా ఇచ్చారు.తనకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే చాలా ఇష్టమని ముఖ్యమంత్రి తెలిపారు. తన చిన్నప్పటి బ్లాక్ అండ్ వైట్ టీవీలు, వీసీఆర్‌ల నుంచి నేడు ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కల్కి’ వంటి అంతర్జాతీయ స్థాయి సినిమాల వరకు వచ్చిన మార్పులను సీఎం గుర్తుచేసుకున్నారు. చెన్నై నుంచి టాలీవుడ్‌ను హైదరాబాద్‌కు తెచ్చిన ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, హీరో రానా దగ్గుబాటి, నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్