Saturday, March 14, 2026

సారా కధ ఇంతింతకాదయా

- Advertisement -

సారా కధ ఇంతింతకాదయా
మహబూబ్ నగర్, మార్చి 14, (వాయిస్ టుడే )

The story of Sara is truly immense.
రాజకీయ నాయకులు సాధారణంగా ఓటర్లకు అభివృద్ధి మంత్రం వేస్తారు, కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాత్రం ఏకంగా  ఆరోగ్య మంత్రం కనిపెట్టారు. అది కూడా ఎక్కడో విదేశాల్లో కాదు.. మన నాటు సారాలో! ఇప్ప పూవుతో కాచిన సారా తాగితే మనుషులు ఏకంగా 110 ఏళ్లు బతుకుతారని ఆయన సెలవిస్తున్నారు.  ఆయన తీరు ప్రపంచ ఆరోగ్య సంస్థ తన హెల్త్ బులిటెన్లను మార్చుకోవాలేమో అన్న అనుమానం కలుగుతోంది.  అనిరుధ్ రెడ్డి  లాజిక్ ప్రకారం.. ప్రస్తుతం మనం వాడుతున్నవన్నీ కల్తీ వస్తువులే, కానీ ఇప్ప పూవుతో తయారు చేసే సారా మాత్రం స్వచ్ఛమైన ఆర్గానిక్  ప్రొడక్ట్ అట.  సారా వల్ల ఆరోగ్యం చెడిపోతుందని నిషేధిస్తే..   ఎమ్మెల్యే గారు మాత్రం అది ఆయుష్షును పెంచే అమృతం  అని సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. పైగా తాను స్టడీ చేశానని కూడా  చెబుతున్నారు.     సారా తాగితే ఆరోగ్యం.. 110 ఏళ్ల ఆయుష్షు ఖాయం అని ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆయన చెబుతుంటే, నెటిజన్లు మాత్రం సెటైర్లతో విరుచుకుపడుతున్నారు.  ఇన్నాళ్లూ ఈ డైట్ ప్లాన్ తెలియక కదా మేము ప్రోటీన్ షేక్స్, గ్రీన్ టీలు తాగి వేస్ట్ అయిపోయాం అని సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. అనిరుధ్ రెడ్డి  కనిపెట్టిన ఈ లాంగ్ లైఫ్ సీక్రెట్ విన్నాక, మందుబాబులు కూడా మా ఎమ్మెల్యే గారు మా కోసం ఏదో ఒక కొత్త స్కీమ్ తెస్తారని తెలుసు.. కానీ ఇది మరీ అదిరిపోయింది అని మురిసిపోతున్నారు.      అనిరుధ్ రెడ్డి తెలంగాణలో నిషేధించిన సారాను తీసుకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీలో కూడా  మాట్లాడతానని అంటున్నారు.  ఆయన  మాటలు నమ్మి ఎవరైనా రేపటి నుంచి ‘ఆర్గానిక్’ పేరుతో సారా బాటిళ్లకు అతుక్కుపోతే, వారి జీవితం 110 ఏళ్ల దాకా వెళ్తుందో లేదో తెలియదు కానీ, వారి లివర్ మాత్రం త్వరగానే  సెలవు  తీసుకుంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అనిరుధ్ రెడ్డి గారు తన సారా పురాణం తో కాంగ్రెస్ పార్టీలో కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. మరి ఈ  ఆర్గానిక్ సారా  ఫార్ములాను ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తుందా? లేక ఎమ్మెల్యే గారి వ్యక్తిగత హెల్త్ టిప్‌గా మాత్రమే మిగిలిపోతుందా? అనేది చూడాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్