Sunday, March 22, 2026

సోషల్ మీడియా పరిచయాలు అమ్మాయిలను ప్రమాదాల్లోకి నెట్టివేస్తున్నాయి: సజ్జనార్

- Advertisement -

సోషల్ మీడియా పరిచయాలు అమ్మాయిలను ప్రమాదాల్లోకి నెట్టివేస్తున్నాయి: సజ్జనార్

Social Media Acquaintances Are Pushing Girls into Danger: Sajjanar

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఎంతోమంది ఆడపిల్లల పాలిట శాపంగా మారుతోందని హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత అపరిచితులతో ఏర్పడుతున్నపరిచయాలు యువతులను ఊహించని ప్రమాదాల్లోకి నెట్టివేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా హెచ్చరించారు.”ఇటీవల కాలంలో ఈ తరహా విషాదకర ఘటనలు నా దృష్టికి ఎక్కువగా వస్తున్నాయి. ఆ కథనాలు చూశాక ఎంతో బాధనిపిస్తోంది. సైబర్ నేరగాళ్లు అందమైన యువకులు లేదా సినీ నటుల ఫోటోలను డీపీలుగా పెట్టుకుని నకిలీ ఖాతాలతో అమ్మాయిలకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి వాటిలో ఫ్రెండ్ రిక్వెస్టులు పంపుతున్నారు. ఆ మాయమాటలకు ఆకర్షితులై కొందరు ఆడపిల్లలు వారిని గుడ్డిగా నమ్మి తమ వ్యక్తిగత ఫోటోలను, వీడియోలను పంచుకుంటున్నారు” అని తెలిపారు.ఆ ఫోటోలను వారితో పంచుకోగానే ఆ అపరిచితులు రాక్షసులుగా మారిపోయి వాటిని అడ్డంపెట్టుకుని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని తెలిపారు. వాటిని మార్ఫింగ్ చేసి డబ్బులు కావాలని, భౌతికంగా కలవాలని వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. పరువు పోతుందన్న భయంతో, ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేక కొందరు అమ్మాయిలు అడిగినంత డబ్బులు ముట్టజెబుతూ తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారని, ఈ వేధింపులు తాళలేక కొందరు తమ ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారుఆడపిల్లలకు విజ్ఞప్తి ఒక్కటేనని, మీకు ఆన్‌లైన్‌లో ఇలాంటి సమస్య లేదా అన్యాయం ఎదురైతే అస్సలు భయపడవద్దని, ఆ సైబర్ నేరగాళ్ల బ్లాక్ మెయిలింగ్‌కు లొంగవద్దని, ప్రాణాలు తీసుకోవద్దని సూచించారు. వెంటనే ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులకు లేదా స్నేహితులకు చెప్పాలని అన్నారు. ఏమాత్రం సంకోచించకుండా డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని, మీకు అండగా పోలీసులు ఎల్లప్పుడూ ఉంటారని హామీ ఇచ్చారు.తల్లిదండ్రులు కూడా పిల్లలతో కాస్త సమయం గడుపుతూ, వారు ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనేదానిపై గమనిస్తూ ఉండాలని సూచించారు.ఫేక్ ప్రొఫైల్స్, ఫేక్ నెంబర్లు, వీపీఎన్‌లు వాడితే పోలీసులకు పట్టుబడబోమని సైబర్ నేరగాళ్లు భ్రమల్లో ఉండవద్దని, మీరు ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆడపిల్లలు సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉంటూ, అన్యాయం జరిగితే ధైర్యంగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్