Sunday, March 22, 2026

విజయ్ పార్టీకి వరుస కష్టాలు… పోటీకి దూరమవుతున్న నేతలు        

- Advertisement -

విజయ్ పార్టీకి వరుస కష్టాలు…
ఖర్చుల భారంతో అభ్యర్థుల ఆందోళన      
పోటీకి దూరమవుతున్న నేతలు        
చెన్నై, మార్చి 21, (వాయిస్ టుడే)

Vijay’s Party Faces a Series of Setbacks… Leaders Opting Out of the Race
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ, నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీలో అంతర్గత సంక్షోభం నెలకొన్నట్లు తెలుస్తోంది. భారీ ఆశలతో రాజకీయాల్లోకి వచ్చిన విజయ్‌కు పొత్తులు కుదరకపోవడం, ఎన్నికల ఖర్చుల భారం అభ్యర్థులపైనే పడటంతో టికెట్లు ఆశించిన నేతలు ఇప్పుడు పోటీకి వెనకాడుతున్నట్లు సమాచారం.పార్టీ పెట్టిన మొదట్లో విక్రవాండిలో జరిగిన భారీ బహిరంగ సభలో విజయ్ ఇతర పార్టీలకు పొత్తుల కోసం పిలుపునిచ్చారు. తొలుత ప్రధాన ప్రతిపక్షం అన్నాడిఎంకె తో చర్చలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే, విజయ్ ఏకంగా 100 సీట్లు కావాలని, రెండున్నర ఏళ్లు ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలని డిమాండ్ చేయడంతో అన్నాడిఎంకె వెనక్కి తగ్గి బీజేపీ వైపు మొగ్గు చూపింది. అటు విదుతలై చిరుతైగళ్  కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వంటి పార్టీలు కూడా డిఎంకె కూటమిని వీడకపోవడంతో విజయ్ చివరకు ఒంటరిగానే బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.తొలుత పార్టీ టికెట్ల కోసం 10 వేల మందికి పైగా ఉత్సాహంగా అప్లికేషన్లు తీసుకున్నప్పటికీ, దరఖాస్తులను తిరిగి సమర్పించిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం పార్టీ అధిష్టానం విధించిన కఠిన నిబంధనలేనని సమాచారం.  సీటు ఖరారు కావాలంటే పార్టీకి రూ. 1 కోటి  చెల్లించాలని అధిష్టానం ఆదేశించినట్లు  చెబుతున్నారు. ప్రచారానికి అదనంగా మరో రూ. 2 కోట్లు  అభ్యర్థులే సమకూర్చుకోవాలని స్పష్టం చేయడంతో ఆశావహులు షాక్‌కు గురవుతున్నారు.మొదటి విడత ఇంటర్వ్యూలలో సుమారు 300 మంది ఉత్సాహం చూపినప్పటికీ, క్షేత్రస్థాయి పరిస్థితులను చూసి చాలామంది వెనకడుగు వేస్తున్నారు. పొత్తులు ఉంటే ఎంతో కొంత నిధులు సమకూరేవి, కానీ ఒంటరిగా అంత భారీ మొత్తం వెచ్చించి ఓడిపోతే పరిస్థితి ఏంటి? అని పార్టీ నేతలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. దీంతో అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి విజయ్‌కు ఏర్పడిందిఎన్నికలకు కేవలం నెల రోజులు మాత్రమే సమయం ఉన్న తరుణంలో, నేతలను ఎలా ఒప్పించాలి? అభ్యర్థుల ఎంపికను ఎలా పూర్తి చేయాలి? అనే అంశంపై విజయ్ మల్లగుల్లాలు పడుతున్నారు. సొంతంగా నిధులు సమకూర్చలేని పక్షంలో, ధనిక వర్గాలకు లేదా బలమైన స్థానిక నేతలకు మాత్రమే టికెట్లు కేటాయించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో అభ్యర్థుల ప్రకటనపై విజయ్ తీసుకునే నిర్ణయం ఆ పార్టీ భవిష్యత్తును నిర్ణయించనుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్