తక్షణ చర్యతో రూ.62,000 నగదు రికవరీ
– ఆటో డ్రైవర్ నిజాయితీ, పోలీస్ సిబ్బంది అప్రమత్తత
మహబూబాబ్ నగర్
Auto Driver’s Honesty and Police Personnel’s Vigilance Lead to Cash Recovery
ఈ నెల 21 న గద్వాల్‌కు చెందిన ఉమాదేవి గద్వాల్‌కు వెళ్లేందుకు ఆటోలో ప్రయాణించారు. పొన్నకల్ స్టేజ్ వద్ద బస్సు ఎక్కే తొందరలో ఆటో దిగిన అనంతరం, తన వద్ద ఉన్న రూ.62,000 నగదు కలిగిన బ్యాగ్ ఆటోలోనే మర్చిపోయిన విషయం గుర్తించారు. ఘటనపై వెంటనే అడ్డకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఎస్ఐ ఎం.శ్రీనివాస్ వెంటనే స్పందించి, పీసీ 218 ఏ.రాహుల్‌ను దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. పీసీ రాహుల్ మండల పరిధిలోని సీసీ కెమెరాలను పరిశీలించి, ఆటో నంబర్ TS 38 T 2272ను గుర్తించి, డ్రైవర్ చంద్రకాంత్ ఖిలగానాపూర్, వనపర్తి జిల్లా గా గుర్తించారు.. పోలీసులు విచారణకు వెళ్లగా, డ్రైవర్ చంద్రకాంత్ డబ్బులు ఎవరికివ్వాలో తెలియక తన వద్ద భద్రపరచుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన నిజాయితీగా స్పందించి, బ్యాగ్‌తో పాటు అందులో ఉన్న రూ.62,000 నగదును పీసీ రాహుల్ కి అప్పగించారు. ఆ తరువాత పీసీ రాహుల్ ఆ మొత్తాన్ని ఎస్ఐ శ్రీనివాస్ కి అందజేయగా, 23-03-2026న అడ్డకల్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఉమాదేవి నగదు తిరిగి అందజేశారు



