బేగంపేట వరుణ్ మోటార్స్ వద్ద “వాహన్” పోర్టల్ ను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
Minister Ponnam Prabhakar formally launched the “Vahan” portal at Varun Motors, Begumpet.
హైదరాబాద్
మంత్రి పొన్నం ప్రభాకర్
బేగంపేట వరుణ్ మోటార్స్ వద్ద “వాహన్” పోర్టల్ ను లాంఛనంగా ప్రారంభించారు. .
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.
వాహన్ పోర్టల్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది
ఇది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం.
ప్రజా పాలన ప్రభుత్వం వచ్చిన తరువాత రవాణా శాఖ లో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం
దేశంలో అన్ని రాష్ట్రాలు వాహన్ సారథి లో ఉండేవి గత సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం సారథి లో చేరాం.
వాహన్ లో చేరాం
వాహన్ ద్వారా సోమవారం నుండి రెండవ వాహన కొనుగోలు చేసే వారికి 2 శాతం అదనపు టాక్స్ రద్దు చేయడం జరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా 15 చెక్కు పోస్టులు ఎత్తివేశాం
వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం.
రవాణా శాఖ ఈవి పాలసీ,స్క్రాప్ పాలసీ తీసుకొచ్చాం
షో రూమ్ లలో పారదర్శకంగా వాహనాల రిజిస్టేషన్ అయ్యేలా చేశాం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రవాణా శాఖ చేస్తున్న సంస్కరణలు, రోడ్ సేఫ్టీ పై కేంద్రంలోనే తెలంగాణ ను గడ్కరీ గారు అభినందించారు.
ఈవీ పాలసీ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలకు తెలంగాణ బ్రాండ్ గా మారుతుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రవాణా శాఖ ఈ డిజిటల్ మార్పును ముందుకు తీసుకెళ్తోంది.
మన రాష్ట్రంలో రోజుకు సుమారు 1,500 వాహనాలు కొత్తగా రోడ్లపైకి వస్తున్నాయి
ఇలాంటి భారీ సంఖ్యలో వాహనాల సమాచారాన్ని సమర్థవంతంగా నిర్వహించాలంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం.
ఈ అవసరాన్ని తీర్చడానికి వాహన్ పోర్టల్ ఎంతో ఉపయోగపడుతుంది.
ఈ పోర్టల్ ద్వారా వాహనాలకు సంబంధించిన అన్ని వివరాలు ఒకే జాతీయ డేటాబేస్‌లో సమీకరించబడతాయి
దీని వల్ల సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా అందుతాయి.
వాహన రిజిస్ట్రేషన్, ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్, పన్నుల చెల్లింపు వంటి సేవలు ఇప్పుడు ప్రజలకు సులభంగా అందుబాటులోకి వస్తాయి
ప్రభుత్వం ప్రజలకు ఆర్థికంగా కూడా ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది.
సోమవారం నుండి రెండవ మరియు తదుపరి వ్యక్తిగత వాహనాలపై ఉన్న అదనపు 2% జీవితకాల పన్నును రద్దు చేస్తున్నాము
ఇది ప్రజలకు ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది.
వాహన్ పోర్టల్ ద్వారా ప్రభుత్వానికి ఖచ్చితమైన డేటా లభించి, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, మరియు భవిష్యత్ ప్రణాళికల్లో మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది.
డిజిటల్ తెలంగాణ నిర్మాణంలో మనమందరం కలిసి ముందుకు సాగుదాం
గతంలో వాహనాల రిజిస్ట్రేషన్ రవాణా శాఖ కార్యాలయాల్లో జరిగేది దానిపై సంస్కరణలు తెచ్చి వాహనాలు కొనుగోలు చేసిన షో రూమ్ లలోనే వాహనాల రిజిస్ట్రేషన్ జరుగుతుంది.
ప్రభుత్వ వాహనాలు కొనుగోలు చేసే వాటికి ఈవి వాహనాలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది
హైదరాబాద్ లో అన్ని డీజిల్ ఆటో లు రేటిరోఫిట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మేము పారదర్శకంగా సమర్థవంతంగా వాహనదారులకు,డీలర్ల తో కోఆర్డినేట్ చేస్తూ సౌకర్యాలు కల్పిస్తున్నాం
2016 లో ప్రారంభమైన ఈ వాహన సారథి లో మనం సోమవారం చేరాం.
గత 10 సంవత్సరాలుగా తెలంగాణ చేరలేదు గత సంవత్సరం నిర్ణయం తీసుకొని సారథి లో చేరి వాహన్ లో చేరాం.
వాహనాలకు సంబంధించిన డేటా ఆన్లైన్ లో ఉంటుంది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా ఉంటుంది.
ప్రభుత్వం తెస్తున్న పాలసీ లో భాగస్వామ్యం కావాలి
ఈవీ డీలర్లను ప్రభుత్వం కోరుతుంది కంజిమర్లు మీ దగ్గరకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునేలా చేశాం.
కన్స్యూమర్ కి ఇబ్బందులు లేకుండా చూడాలి పారదర్శకంగా సమర్థవంతంగా చేయాలి వారికి త్వర తర్వగా పూర్తయ్యేలా చేయాలి.
రోడ్ సేఫ్టీ లో జ్యూరీ భాగస్వామి కావాలి మీరు వాహనాలు అమ్మినప్పుడు రోడ్ సేఫ్టీ పై అవగాహన కల్పించేలా కొనుగోలు చేసిన వారికి హెల్మెట్ లు ఇవ్వడం కాలుష్యాన్ని తగ్గించేలా వాహనాన్ని కొనుగోలు చేసిన వారికి ఒక మొక్కను అందించాలి.
ఈ అవకాశాన్ని ప్రజలంతా ఉపయోగించుకోవాలి
ఏటీఎస్ లు ఏర్పాటు చేస్తున్నాం రవాణా శాఖ కు కొత్త లోగో తెచ్చాం.
రవాణా శాఖ తెస్తున్న సంస్కరణలు పై ప్రజలు సంతోషంగా ఉన్నారు
రవాణా శాఖ లో 100 శాతం ఆన్లైన్ లో సేవలు కొనసాగిస్తున్నాం.
తెలంగాణ రావడానికి కారకులు ఆర్టీసీ ఉద్యోగులు
రవాణా శాఖ ఆర్టీసీ ఉద్యోగులకు కుటుంబ పెద్దగా ఉంటా.
ప్రభుత్వ పరిధిలో రెండు అంశాలున్నాయి
విలీనం గుర్తింపు సంఘాలు అంశం ప్రభుత్వం పరిధిలో ఉంద మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తీ, జెటిసి లు చంద్రశేఖర్ గౌడ్, రమేష్ , శివలింగయ్య, ఎన్ఐసి ప్రతినిధి జగదీప్ , వరుణ్ మోటార్స్ అధినేత వరుణ్, డిటిసి లు ఇతర రవాణా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.



