అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు

- Advertisement -

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు
హైదరాబాద్ మార్చ్ 23

Telangana High Court Issues Notices to Assembly Speaker Gaddam Prasad Kumar
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. దానం నాగేందర్ పార్టీ మారిన వ్యవహారంలో స్పీకర్ తీర్పును కొట్టివేయాలని ఏలేటి పిటిషన్‌ దాఖలు చేశారు.బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన దానం నాగేందర్.. కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారని న్యాయస్థానం దృష్టికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీసుకొచ్చారు. ఇతర పార్టీ నుంచి నామినేషన్ వేసిన రోజు నుంచే ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. ఈ సందర్భంగా కర్ణాటక, బిహార్‌లో ఇలాంటి పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన ప్రస్తావించారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని దానం నాగేందర్‌తో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 16వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular