Sunday, April 19, 2026

తన గురువు డా. జైశెట్టి రమణయ్య  మరణం పట్ల కేసీఆర్ సంతాపం.

- Advertisement -

తన గురువు డా. జైశెట్టి రమణయ్య  మరణం పట్ల కేసీఆర్ సంతాపం.
హైదరాబాద్

KCR expresses condolences on the passing of his mentor, Dr. Jaishetty Ramanayya.
తనకు చదువు చెప్పిన గురువు, జగిత్యాలకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు, రిటైర్డ్ లెక్చరర్ డా. జైశెట్టి రమణయ్య  మరణం పట్ల, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్  విచారం వ్యక్తం చేస్తూ,

సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా తనకు గురువుగా, అత్యంత ఆత్మీయుడైన రమణయ్య తో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్  స్మరించుకున్నారు. రమణయ్య  సిద్దిపేటలో లెక్చరర్గా పనిచేస్తున్న సమయంలో,

తను ఇంటర్మీడియట్ విద్యార్థిగా తన దగ్గర విద్యనభ్యసించిన సందర్భాన్ని కేసీఆర్  గుర్తు చేసుకున్నారు. అయన  మరణంతో శొకతప్త హృదయులైన కుటుంబ సభ్యులకు కేసీఆర్  తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

రమణయ్య  ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
కాగా.. 1971లో సిద్దిపేటలో జూనియర్, డిగ్రీ కాలేజీలో హిస్టరీ లెక్చరర్గా డా. జైశెట్టి రమణయ్య పని చేశారు. చిన్న వయసులోనే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన అరుదైన వ్యక్తిగా, జగిత్యాలలో మొట్టమొదట డాక్టరేట్ పొందిన

పరిశోధన విద్యార్థిగా అయనకు కి పేరున్నది. “సౌత్ ఇండియా టెంపుల్స్” అనే పరిశోధనాత్మక గ్రంధాన్ని సమర్పించి జైశెట్టి రమణయ్య   పీహెచ్డీ డాక్టర్ పట్టాను పొందారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్