యాదాద్రి లో మహా ఆధ్యాత్మిక ఉత్సవం – 5000 మందితో విశ్వశాంతి మహాయజ్ఞం
📍 మున్నూరు కాపు నిత్య అన్నదాన సత్రం ఆధ్వర్యంలో ఘన కార్యక్రమం
యాదాద్రి భువనగిరి జిల్లా, ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దివ్య ఆశీర్వాదాలతో ఆధ్యాత్మిక మహోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
మున్నూరు కాపు, కాపు నిత్య అన్నదాన సత్రం ఆధ్వర్యంలో ఈ నెల 19, 2026 ఆదివారం ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు భారీ స్థాయిలో భక్తి కార్యక్రమాలు జరగనున్నాయి.
ఈ సందర్భంగా సుమారు 5000 మందికి పైగా భక్తులు పాల్గొననున్న మహా యజ్ఞం, కళ్యాణ మహోత్సవం, విశ్వశాంతి ప్రార్థనలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు .
కార్యక్రమ ముఖ్యాంశాలు
🔸 108 దంపతులతో శ్రీ సుదర్శన నరసింహ విశ్వశాంతి మహాయజ్ఞం
🔸 1008 దంపతులతో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం
🔸 చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు శ్రీ సి.ఎస్. రంగరాజన్ గారి ప్రవచనం
🔸 మహిళలచే ప్రత్యేకంగా విష్ణు సహస్రనామ పారాయణం
🔸 అవసరాన్ని బట్టి వసతి సదుపాయం అందుబాటులో ఉంటుంది
🔸 5000కు పైగా భక్తుల పాల్గొనుట ఆశించబడుతోంది
🔸 ప్రత్యక్ష ప్రసారం మరియు దైవిక కార్యక్రమాలు
🔸 దివ్య ఆశీర్వాదాలు పొందే అరుదైన అవకాశం
ఈ పవిత్ర కార్యక్రమంలో అన్ని భక్తులు, కుటుంబ సభ్యులు పాల్గొని భగవంతుని కృపను పొందవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసన్న పాదాల చెంత దినదిన అభివృద్ధి చెందిన మున్నూరు కాపు (కాపు) నిత్య అన్నదాన సత్రం వచ్చే ఆదివారం అంగరంగ వైభవంగా జరగబోతున్న శ్రీ లక్ష్మీ నరసింహుని కళ్యాణోత్సవం తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన, యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పాదాల చెంత మున్నూరు కాపు, కాపు సత్ర భవనమును తెలుగు రాష్ట్రాల లో ఉన్నటువంటి మున్నూరు కాపు, కాపు కుటుంబాలకు అందించాలనే ఉద్దేశంతో, తొలి తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్ నేతి విద్యా సాగర్ కార్య దీక్షలో భాగ స్వాములై, మున్నూరు కాపు, కాపు కుటుంబాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, సామాజిక సేవకులతో 2012 సంవత్సరంలో ఒక హంపింగ్ సొసైటీ గా ఏర్పడి రెండు ఎకరాల భూమిని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి మున్నూరు కాపు, కాపు నిత్యాన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ను, తెలంగాణ తొలి శాసన మండలి మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్ తో పాటు మరో 9మంది ఫౌండర్ ట్రస్టీలు గా ఏర్పడి రిజిస్ట్రేషన్ చేసి పూర్తి బాధ్యతలు తీసుకున్నారు, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర మంత్రి గా ఉన్న పల్లంరాజు, ఆనాటి తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ చిత్తూరు ఎంపీ, ఆది కేశవులు నాయుడు, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి మున్నూరు కాపు, కాపు కుటుంబాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 2012లో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి పాదాల కింద తీసుకున్నటు వంటి భూమిలో భూమి పూజ చేసి, 2021 సంవత్సరంలో 100 గదులు, రెండు మినీ బ్యాంకెట్ హాల్స్, సుమారు ఎనిమిది వందల మందికి సరిపడే కళ్యాణ మండపం నిత్య అన్నదాన సత్రంనీ 2021 సంవత్సరముల ప్రారంభించి, సేవలోకి తీసుకు వచ్చారు, మొదటి నుండి ప్రతిపక్ష, స్వపక్షాలలో అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా తొలి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గా అగ్రతాంబూలం అందుకున్న, తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్, ఇప్పటి శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మున్నూరు కాపు, కాపు నిత్య అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నేతి విద్యాసాగర్ నేతృత్వంలో 36 మంది ట్రస్టు సభ్యుల సహకారంతో దినదిన అభివృద్ధి కాంచి, వచ్చే ఆదివారం సుమారు 5000 మందితో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి లోక కళ్యాణం, విశ్వశాంతి మహా యజ్ఞం, అన్నప్రసాద విస్తరణను అద్భుతంగా నిర్వహించ బోతున్నామని నిర్వాహకులు తెలిపారు, ఈసందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని లక్ష్మీ నరసింహుని కృపా కటక్షాలను పొందాలని కోరారు.
Register Now At
Event Website: https://mkbhavan-yadagirigutta.in/
Main website: https://www.munnurukapubhavan.org/
Regards
Sri. Vikram Cirigiri : 9989795599
Sri. Tella Muralidhar : 9866701232



