పవన్ కల్యాణ్ ట్వీట్‍కు ప్రకాశ్ రాజ్ కౌంటర్..చర్చకు సిద్ధమా అంటూ చాలెంజ్

- Advertisement -

పవన్ కల్యాణ్ ట్వీట్‍కు ప్రకాశ్ రాజ్ కౌంటర్..

చర్చకు సిద్ధమా అంటూ చాలెంజ్

Prakash Raj Counters Pawan Kalyan’s Tweet—Challenges Him: “Are You Ready for a Debate?”

అమరావతి:
131వ రాజ్యాంగ సవరణ బిల్లు శుక్రవారం లోక్‍సభలో వీగిపోవడంపై దేశవ్యాప్తంగా రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ పరిణామంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన

ట్వీట్ పై ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ‘భారత చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెంచే చారిత్రాత్మక అవకాశాన్ని విపక్షాలు కావాలనే అడ్డుకున్నాయి. దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం

చేసే, మహిళా సాధికారతకు బాటలు వేసే సంస్కరణలకు మద్దతు ఇచ్చే ఉద్దేశం విపక్షాలకు లేదు’ అంటూ పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా చేసిన పోస్టుపై ప్రకాశ్ రాజ్ అదే ఎక్స్ వేదికగా శనివారం రియాక్ట్

అవుతూ.. ‘దయచేసి మోదీని సంతోషపెట్టడం కోసం ప్రజలను తప్పుదోవ పట్టించడం ఆపండి. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే ఆమోదం పొందింది. దాన్ని ఇప్పటికైనా అమలు చేయవచ్చు. కానీ మీ

గ్యాంగ్ దక్షిణ భారత రాష్ట్రాల, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రాతినిధ్యాన్ని బలహీనపరిచే డీలిమిటేషన్ బిల్లును తీసుకురావాలని చూస్తోంది. మిమ్మల్ని డిప్యూటీ ముఖ్యమంత్రిని చేసిన ఆంధ్ర ప్రజల

ఆత్మగౌరవాన్ని, రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టవద్దు’ అని పోస్టు చేశారు. ఈ విషయాన్ని వివరించడానికి నేను చర్చకు సిద్ధంగా ఉన్నానానని మరి మీరు సిద్దమా అని ప్రశ్నించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular