ఘనంగా ‘నీ నానుండి దూరంగా’ సాంగ్ లాంచ్
Grand launch of the song ‘Nee Naanundi Dooramga’
MSM ప్రొడక్షన్ నిర్మాణంలో రూపొందిన ‘నీ నానుండి దూరంగా’ సాంగ్ లాంచ్ కార్యక్రమం ఇటివలే హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో వైభవం గాజరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల, ప్రముఖ నటుడు వికాస్ వశిష్ఠ ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.‘నీ నానుండి దూరంగా’ సాంగ్ ను జ్ఞానానంద దర్శకత్వంలో రూపొందించారు .చిత్రానికి రామ్‌చరణ్ మాటూరి సంగీతాన్ని అందించారు. ప్రేమ, భావోద్వేగాలకు ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కిన ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది.ఈ సాంగులో హీరోగా అభిరామ్ పాత్రలో గిరిధర్ నటిస్తుండగా, హీరోయిన్‌గా జానకి పాత్రలో మధు కనిపించనున్నారు.
గ్రాండ్ సాంగ్ లాంచ్ సందర్భంగా సంగీతం, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయని ముఖ్య అతిథులు పేర్కొన్నారు. చిత్ర బృందానికి తమ అభినందనలు తెలియజేశారు.
ఘనంగా ‘నీ నానుండి దూరంగా’ సాంగ్ లాంచ్

- Advertisement -
- Advertisement -



