Thursday, April 23, 2026

తమిళనాడు ఎన్నికలో ఎవరి బలం ఎంత..  అధికారం ఎవరిది..

- Advertisement -

తమిళనాడు ఎన్నికలో ఎవరి బలం ఎంత..
 అధికారం ఎవరిది..

Tamil Nadu Elections: Who Holds How Much Strength?
Who Will Wield Power?
తమిళనాడులో గురువారం నాడు తొలి విడత పొలింగ్ జరిగింది.  రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన డీఎంకే, ఏఐడీఎంకే, టీవీకే మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఐదేళ్లకు ఒకసారి అధికారాన్నీ మార్చేసే తీర్పునిచ్చే తమిళ తంబీలు ఈ సారి ఏ పార్టీకి అధికారం కట్టబెడతారోనని ఉత్కంఠ నెలకొంది. ఈ త్రిముఖ పోటీలో ఏ పార్టీ బలం ఎంత.. ఎవరు అధికారాన్ని చేజిక్కించుకుంటారో అన్న అంచనాలు చక్కర్లు కొడుతున్నాయి.
డీఎంకే
అధికార డీఎంకే  పార్టీ 14 పార్టీలతో కలిసి ఈసారి ఎన్నికల బరిలో నిలిచింది. 164 స్థానాల్లో డీఎంకే సొంతగా పోటీ చేస్తూ మిగిలిన స్థానాల్లో కూటమి అభ్యర్థులు పోటీచేస్తున్నారు. స్థూలంగా పరిశీలిస్తే డీఎంకే కేత్రస్థాయిలో బలంగా ఉన్న పార్టీ. తన ఐదేళ్ల పాలనలో అభివుద్దితో పాటు సంక్షేమ పథకాలను అందించడంలో స్టాలిన్ సక్సెస్ అయ్యారు. తమిళ జాతీయ వాదం ఈ పార్టీకి కలిసొచ్చే మరొక అంశం. మధ్యతరగతి వర్గాలు డీఎంకే పట్ల సానుకులంగా ఉన్నాయి. అలాగే ముస్లిమ్ మైనారిటీలు మద్దతూ కూడా ఈ పార్టీకి ఎక్కువ ఉంది. దక్షిణతమిళనాడులో ప్రధాన కులాన్ని డీఎంకే తనవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. పోల్ మేనేజిమెంట్ లోను డీఎంకే చాలా స్ట్రాంగ్ గా ఉంది. హిందీ వ్యతిరేక ఉద్యమంతో తమిళ ఆత్మగౌరవం అంటే డీఎంకే అనే భావాన్ని ప్రజలలో కలిగించారు. అయితే అవినీతి ఆరోపణలు, హిందూ వ్యతిరేక సంఘటనలు, మహిళపై అఘాయిత్యాలు వంటివి పెరగడం, డ్రగ్స్ వంటివి రాష్ట్రంలో పెరిగాయి. అలాగే ఉద్యోగులలో కొంత వ్యతిరేకత ఆ పార్టీకి నెగిటివ్ అంశాలుగా చెప్పుకోవచ్చు..
ఏఐఏడిఎంకే : మాజీ ముక్యమంత్రి జయలలిత మరణంగా ప్రభావం కోల్పోయిన అన్నాడీఎంకే పార్టీకి ఇప్పటికి గ్రౌండ్ లెవల్ క్యాడర్ బలంగా ఉంది. పన్నిర్ సెల్వం, పళనిస్వామి మధ్య విభేదాలతో క్యాడర్ లో కొంత చీలిక వచ్చిన పాలినిస్వామి పార్టీని, కార్యకర్తలను ఒకతాటిపైకి తేగలిగారు.ఈ ఎన్నికల్లో 166 స్థానాల్లో పోటీ చేస్తున్న అన్నాడీఎంకేకు బీజేపీ, అన్బుమణి రామదాస్ పార్టీ పీఎంకే మద్దుతు కాస్త కలిసొచ్చే అంశం. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్, టివికే  విజయ్ మాదిరిగా అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి పళినిస్వామికి మాస్ అప్పీరియయన్స్ లేదు. అలాగే విజయ్ పార్టీ నుండి అన్నాడీఎంకేకు భారీ ముప్పు పొంచి ఉందని పొలిటికల్ విశ్లేషకుల అభిప్రాయం.

టీవికే : సినీ నటుడు విజయ్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సినిమాలలో స్టార్ గా కొనసాగుతున్న విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాలలో ఎంట్రీ ఇవ్వడంతో తమిళనాడు పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉండడం, అలాగే క్రిస్టియన్ మైనారిటీ ఓట్ బ్యాంక్ విజయ్ కు బిగ్ అడ్వాంటేజ్. యువత, మహిళలు విజయ్ కు మద్దతు ఉంది. అలాగే పార్టీకి గ్రామ స్థాయిలో ఓట్ బ్యాంక్ లేకపోవడం, బూత్ లెవల్ లో క్యాడర్ లేకపోవడం విజయ్ పార్టీకి నెగిటివ్ అంశం. దానికి తోడు కరూర్ తొక్కిసలాట, భార్యతో విడాకులు, త్రిషతో వ్యవహారం విజయ్ ను ఇబ్బందిపెట్టె అంశాలు. కానీ వాటిని ప్రజలు ఎంతవరకు పట్టించుకుంటారు అనేది చెప్పలేం. మరోవైపు విజయ్ సభలకు భారీగా జనం వస్తున్నారు కానీ అవి ఎంతవరకు ఓట్లుగా మారతాయనేది చూడాలి. దానికి తోడు విజయ్ పార్టీలో టికెట్లు పొందిన వారు డీఎంకే, అన్నాడీఎంకే నుండి వచ్చిన వారు కేవలం డిజిటిల్ మీడియాపై ఎక్కవ ఆధారపడి ఎన్నిలకు వెళ్తున్నారు విజయ్.
అధికార డీఎంకే పార్టీపై ఉన్న వ్యతిరేక ఓటు బ్యాంకును కొత్తగా వచ్చిన TVK పార్టీ విజయ్ చీల్చడం డీఎంకే కు ప్లస్ పాయింట్. కానీ అది అన్నాడీఎంకేకు భారీ నష్టం కలిగిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే విజయ్ కు కూడా భారీగా ఓట్లు పడతాయని.. మొత్తంగా చూస్తే డీఎంకే కొంత సానుకూల పవనాలు ఉన్నా కూడా తమిళ తంబీలు ఎప్పుడు ఎవరికీ అధికారం కట్టబెడతారో ఎవరికీ ఎలాంటి షాక్ ఇస్తారో చెప్పలేమని తెలిపారు. ఈ త్రిముఖ పోటీలో ఎవరు గెలుస్తారో మే4న తెలుస్తుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్