Friday, April 24, 2026

అలరించిన బాలనాగమ్మ నాటకం

- Advertisement -

అలరించిన బాలనాగమ్మ నాటకం

వేంకటేశ్వర బ్రహ్మోత్సవాల్లో హైలైట్ గా నిలిచిన ప్రదర్శన

The Play ‘Balanagamma’ Entertained the Audience
హైదరాబాద్, ఏప్రిల్ 23:

బాలనాగమ్మ నాటక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ప్రగతినగర్లోని శ్రీవేంకటేశ్వర బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఈ నాటకాన్ని గురువారం ప్రదర్శించారు. 141 ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీ శారదా విజయ నాట్యమండలి వారు ప్రదర్శించిన
బాలనాగమ్మ’ నాటకం ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ పొందింది. ఈ నాటకంలో బాలనాగమ్మ, అక్కచెల్లెళ్ల కష్టాలు, మాయల ఫకీర్ చేతిలో బందీ కావడం వంటి సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ముఖ్యంగా, మాయల ఫకీర్, సంగు వంటి పాత్రలు ప్రేక్షకుల కరతాళ ధ్వనులందుకున్నాయి. నాటకం ఆద్యంతం అర్థవంతంగా, రసాత్మకంగా సాగుతూ, నాటి నైతిక విలువలను గుర్తుచేసాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న కళాకారులు సినిమా మాదిరి కళ్ళకు కట్టారు. మాయలు ఫకీరు గా సురభి శివశంకర్, బాలనాగమ్మ పాత్రలో  సురభి హేమ మాలిని నటనా కౌస్తభాన్ని చాటారు. యిలా ప్రతి ఒక్కరూ పాత్రలో లీనమై నటించి మెప్పించారు. నటులు ఒకరితో ఒకరు పోటీపడి నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్