Wednesday, April 29, 2026

కేటీఆర్ వర్సెస్ కవిత

- Advertisement -

కేటీఆర్ వర్సెస్ కవిత
హైదరాబాద్ ఏప్రిల్ 29, ( వాయిస్ టుడే )

KTR vs Kavitha
కల్వకుంట్ల కుటుంబంలో వారసత్వ పోరు ఇప్పుడు కీలకదశకు చేరుుంది. కేసీఆర్ వారసులలో ఎవరు సమర్థులు కేటీఆర్ నా..కవితనా ?. కేటీఆర్.. మగపిల్లాడే వారసుడు అనే అడ్వాంటేజ్ తీసుకుని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిపోయారు. ఆయన నాయకత్వాన్ని మొదట కవిత కూడా అంగీకరించారు. కానీ తనకు అసలు రాజకీయ భవిష్యత్తే లేకుండా చేయాలనుకోవడంతో కవిత తన దారి తాను చూసుకున్నారు. ఆమె సొంత రాజకీయాలు ప్రారంభించడంతో నిజంగా ఇద్దరిలో ఎవరు రాజకీయంగా సమర్థులు అనే ప్రశ్న వస్తోంది.బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని గాడిలో పెట్టడంలో కేటీఆర్ ఆశించిన స్థాయిలో సఫలం కాలేదనే అభిప్రాయం బలంగా ఉంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, పార్టీ నుంచి కీలక నేతల వలసలు ఆయన నాయకత్వ వైఫల్యానికి అద్దం పడుతున్నాయి. కేసీఆర్ మళ్లీ క్రియాశీలక బాధ్యతలు తీసుకోవాలని .. పార్టీని గాడిలో పెట్టాలని కేడర్ కోరుకోవడమే కేటీఆర్ వైఫల్యానికి నిదర్శనమని చెబుతున్నారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఢీకొట్టే విషయంలో పెద్దగా ఆకట్టుకోలేకపోవడం…ప్రజా సమస్యలపై కంటే కేవలం సోషల్ మీడియా విమర్శలకే పరిమితం కావడం ఆయన రాజకీయ పరిణతిని ప్రశ్నించేలా చేశాయి.కవిత తన రాజకీయ అస్తిత్వం కోసం అత్యంత తెలివైన పావులను కదిపారు. బీఆర్ఎస్ వదులుకున్న తెలంగాణ, టీఆర్ఎస్ సెంటిమెంట్‌ను ఆమె మళ్లీ అందిపుచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సేన ఆవిర్భావ సభకు తరలివచ్చిన జనసందోహం, ఆమె మాటల్లోని స్పష్టత రాజకీయ వర్గాలను మెప్పించాయి. తండ్రి, సోదరుడిపై నేరుగా విమర్శలు చేస్తూనే, బీఆర్ఎస్ తన ఆత్మను కోల్పోయిందని, తాను మళ్లీ సామాజిక తెలంగాణ ఆశయాలను మోస్తానని చెప్పడం ద్వారా ఆమె బీఆర్ఎస్ ఓటు బ్యాంకుపై గట్టిగా గురిపెట్టారు.ఇప్పటివరకు జరిగిన పరిణామాలను బట్టి చూస్తే, రాజకీయ ఎత్తుగడల్లో కేటీఆర్ కంటే కవితే కాస్త ముందున్నట్లు కనిపిస్తోంది. కేటీఆర్ కేవలం పార్టీ పదవిని వారసత్వంగా స్వీకరిస్తే, కవిత మాత్రం ప్రతికూల పరిస్థితుల్లో కూడా తనదైన శైలిలో పబ్లిసిటీని, జనసమీకరణను నిర్వహించి ఇంపాక్ట్ సృష్టించగలిగారు. బీఆర్ఎస్‌ను డూప్లికేట్ అని పిలిచే స్థాయికి ఆమె తన కొత్త పార్టీని తీసుకెళ్లడం ఆమె రాజకీయ చతురతకు నిదర్శనం. నియోజకవర్గ స్థాయి నేతలను ఆకర్షించడంలో, ముఖ్యంగా బీఆర్ఎస్‌లో వివక్షకు గురైన వారిని చేరదీయడంలో ఆమె వేగం పెంచారు.కవిత సృష్టించిన ఈ ఇంపాక్ట్ బీఆర్ఎస్‌కు పెనుగండంగా మారే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు చీలితే అది పరోక్షంగా అధికార కాంగ్రెస్ లేదా బిజెపికి లాభం చేకూరుస్తుందా? లేక కవిత నిజంగానే మూడవ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందా? అన్నది ఉత్కంఠ రేపుతోంది. కేటీఆర్ ఇప్పటికైనా తన శైలిని మార్చుకుని పార్టీని కాపాడుకుంటారా, లేక కవిత సృష్టించిన ఈ సునామీలో బీఆర్ఎస్ తన ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్