Wednesday, May 13, 2026

‘పెద్ది’ మూవీ భోపాల్‌లో ఏఆర్ రెహమాన్ లైవ్‌లో సాంగ్ పెర్ఫార్మ్

- Advertisement -

‘పెద్ది’ మూవీ భోపాల్‌లో ఏఆర్ రెహమాన్ లైవ్‌లో సాంగ్ పెర్ఫార్మ్

AR Rahman Performs a Song Live for the Movie ‘Peddi’ in Bhopal

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మచ్ అవైటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’తో బాక్సాఫీస్‌ తుఫాన్ సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్సెస్‌లో చరణ్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. ఇప్పుడు ఈ చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో మ్యాసీవ్ ప్రమోషన్స్ ప్రారంభమవుతున్నాయి.
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో నిర్మాత వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ‘పెద్ది’ని భారతీయ సినిమాకు కొత్త అనుభూతిని ఇచ్చే విజువల్ స్పెక్టకిల్‌గా రూపొందించారు. ఇప్పుడు ఆ ఎక్సయిట్మెంట్ మరింత పెంచుతూ ముంబై, భోపాల్ నగరాల్లో రెండు భారీ ఈవెంట్స్ ప్లాన్ చేశారు.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్‌ను మే 18న ముంబైలో గ్రాండ్ ఈవెంట్‌లో విడుదల చేయనున్నారు. ఈ ఈవెంట్ ద్వారా సినిమా భారీ కాన్వాస్‌ను జాతీయ మీడియా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు.
ముంబై ట్రైలర్ లాంచ్ తర్వాత, చిత్ర బృందం ఈ కథ మూలాలను సెలబ్రేట్ చేయడానికి హార్ట్ అఫ్ ఇండియా గా పిలిచే భోపాల్‌కు వెళ్లనుంది. మే 23న అక్కడ స్పెషల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
ఈ ఈవెంట్‌ను మరింత ప్రత్యేకంగా మార్చేలా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వయంగా ‘పెద్ది’ పాటలను లైవ్‌లో పెర్ఫార్మ్ చేయనున్నారు. అలాగే “సౌండ్ ఆఫ్ పెద్ది”ను లాంచ్ చేయనున్నారు. రెహమాన్‌తో పాటు పలువురు ప్రముఖ గాయకులు వేదికపై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు.
ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’, ‘రైరై రారా’ పాటలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అలాగే రామ్ చరణ్ గ్లింప్సెస్ ప్రేక్షకుల్లో అడ్రినలిన్ రష్‌ను కలిగించాయి. దీంతో సినిమాను బిగ్ స్క్రీన్ చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘పెద్ది’ ఓవర్సీస్ మార్కెట్‌లో ఇప్పటికే రికార్డులు సృష్టిస్తోంది. కేవలం ప్రీమియర్స్‌కే నార్త్ అమెరికాలో US$225K ప్రీ-సేల్స్ నమోదు చేసింది.
ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రపంచ స్థాయి ప్రొడక్షన్ వాల్యూస్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయబోతున్నాయి.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఎడిటింగ్ నిర్వహిస్తున్న ఈ భారీ చిత్రానికి ఇప్పటికే ఫుల్ ఎడిట్ లాక్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ‘పెద్ది’ జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, జూన్ 3న ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి.
తారాగణం: రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్