ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేషన్ చైర్మన్లు

భేటీలో తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి
హైదరాబాద్, మే 25 (వాయిస్ టుడే):
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఇటీవల నియమితులైన వివిధ రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్ చైర్మన్లు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తమపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సంక్షేమం, ప్రభుత్వ లక్ష్యాల సాధన కోసం అంకితభావంతో పనిచేస్తామని హామీ ఇచ్చారు.
ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేలా కార్పొరేషన్ ద్వారా మున్నూరు కాపు వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రిని కలిసిన వారిలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్ చైర్మన్లు పాల్గొని తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తామని తెలిపారు.



