ప్రజలకు అత్యుత్తమ సేవలే లక్ష్యంగా రెవెన్యూ వ్యవస్థలో స‌మూల మార్పులు :మంత్రి  పొంగులేటి

- Advertisement -

ప్రజలకు అత్యుత్తమ సేవలే లక్ష్యంగా
రెవెన్యూ వ్యవస్థలో స‌మూల మార్పులు
కార్పొరేట్ స్ధాయిలో  ఇంటిగ్రేటెడ్  స‌బ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
ఇప్పటికే నాలుగు ఇంటిగ్రేటెడ్ భ‌వ‌నాలకు శంకుస్థాపన
రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచే ప్రసక్తే లేదు
సందేహాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 4788
వాట్స్ యాప్ నెంబర్ 8247619983
రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ
మంత్రి  పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి

Radical changes in the revenue system aimed at providing the best services to the people: Minister Ponguleti
తెలంగాణ ప్రజలకు వేగవంతంగా పార‌ద‌ర్శకంగా అత్యుత్తమ  సేవలు అందించాలనే లక్ష్యంతో  రెవెన్యూ వ్యవస్థలో స‌మూల మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టామ‌ని  రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి తెలిపారు.
గచ్చిబౌలిలోని  తాలిమ్ లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయ నిర్మాణ పనులను గురువారం నాడు మంత్రి  పరిశీలించారు.  అంతకుముందు సచివాలయంలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు.  రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని మంత్రి  స్పష్టంచేశారు.  గత బీ.ఆర్.ఎస్. ప్రభుత్వం 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచింది.  ఒక్క శాతం పెంచిన కూడా వేల కోట్ల రూపాయల భారం ప్రజలపై పడుతుందనే ఆలోచనతో   ప్రజాకోణంలో నిర్ణయం తీసుకొని వాస్తవానికి దగ్గరగా శాస్త్రీయ పద్దతిలో భూముల విలువలను సవరించామని తెలిపారు.  ఎలాంటి అక్రమాలకు తావు ఇవ్వకూడదన్న ఆలోచనతో సబ్ రిజిస్ట్రార్ ల అధికారాలను కుదించడం జరిగిందన్నారు.  రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలల్లో వ్యవసాయ భూముల విలువ ఎకరానికి కనీసం 2.75 లక్షలుగా నిర్ణయించామని, మున్సిపల్ కార్పొరేషన్ లలో ఎకరానికి 5 లక్షలుగా, హెచ్.యం.డి.ఏ. పరిధిలో 10 లక్షలుగా, ఓ.ఆర్.ఆర్. పరిధిలో 15 లక్షలుగా నిర్ణయించడం జరిగిందన్నారు.  సవరించిన భూములు విలువలపై ఎక్కువ తక్కువలుంటే సమీక్షిస్తామని తెలిపారు.  సవరించిన భూముల విలువలు, సందేహాలు ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 4788, వాట్స్ యాప్ నెంబర్ 8247619983 నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
ఏ ఫైల్ పై గుడ్డిగా సంతకం పెట్టలేదు.  నేను ఏ తప్పు చేయలేదు.
మంత్రుల శాఖాల మార్పుపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు మంత్రి  స్పందిస్తూ “తాను సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని.  దేవుడి దయతో ఇంతవరకు వచ్చాను.  నాకు ఏ శాఖ ఇచ్చినా మనస్ఫూర్తిగా పనిచేస్తాను.  నేను ఏ తప్పు చేయలేదు. తప్పు చేసే వ్యక్తిని కాను.  ఏ ఫైల్ పై గుడ్డిగా సంతకం పెట్టలేదు. చట్ట ప్రకారం పనిచేస్తున్నాను. రెవెన్యూ శాఖలో అక్రమాలకు పాల్పడ్డవారిపై, ఎ.సి.బీ. ట్రాప్ అయిన వారిపై  గత ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విచారణ జరగకుండా తప్పు చేసిన వారిని తప్పించే ప్రయత్నం చేశారు. మూడు, నాలుగు సంవత్సరాలపాటు ఫైళ్లను తొక్కిపెట్టారు.  నేను రెవెన్యూ శాఖ మంత్రిగా భాద్యతలు స్వీకరించినప్పటి నుంచి  ఇప్పటి వరకు దాదాపు 3,500 ఫైళ్లను క్లియర్ చేసాను. తప్పు చేసిన వారికి శిక్ష పడే విధంగా నిర్ణయాలు తీసుకున్నాను. ఎవర్ని క్షమించలేదు, ఉపేక్షించలేదు.  శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు 10 సంవత్సరాలు గడిచిన కూడా ఆ నాటి ప్రభుత్వంలో కనీసం జవాబులు ఇవ్వలేదు.  అడిగిన సభ్యుల   పదవి కాలం కూడా ముగిసింది.  ఇటీవల అన్నీ ఫైళ్లను క్లియర్ చేశాను.  గత ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ జరిగిన అసైన్డ్ భూములను ఇప్పుడు నిషేదిత జాబితాలో పెట్టడం జరిగింది.  భూములకు సంబంధించిన ప్రతీ డాక్యుమెంట్ ను డిజిటలైజేషన్ చేస్తాం.
ఫ్యూచర్ సిటీ రద్దుచేయడం సాధ్యంకాదు.  ఫ్యూచర్ సిటీ లో లాండ్స్ ఫ్రీ గా ఇవ్వడం లేదు.  రద్దు చేస్తే ప్రభుత్వం డబ్బు తిరిగి ఇవ్వవలసి ఉంటుంది.  ఇది సాధ్యమయ్యే పనికాదు.
ప్రజలకు పారదర్శకమైన, అవినీతి రహిత సేవలు అందించేందుకు స్టాంప్స్ & రిజిస్ట్రేషన్స్ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చాం. స్లాట్ బుకింగ్ విధానం ద్వారా సమయాన్ని ఆదా చేయడమే కాకుండా అత్యాధునిక సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మిస్తున్నాం.
మొదటి దశ లో ఔట‌ర్ రింగ్ రోడ్డు ప‌రిధిలో 39 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌ను 13 క్లష్టర్‌లుగా విభ‌జించి ప్రభుత్వంపై ఎలాంటి ఆర్ధిక‌ భారం ప‌డ‌కుండా ప్రైవేటు నిర్మాణ రంగ సంస్ధల‌తో నిర్మిస్తున్నాం.  నిర్మాణంతో పాటు ఐదు సంవ‌త్సరాల నిర్వహాణా బాధ్యత‌ను కూడా ఆ సంస్ధలకే అప్పగించాం.   మూడు నుంచి ఐదు ఎక‌రాల స్ధలంలో కార్యాల‌యాల‌ను ఏర్పాటు చేస్తున్నాం. వివాహ రిజిస్ట్రేష‌న్ల కోసం మినీ మ్యారేజీ హాల్‌, గ‌ర్బిణీల‌కు, వృద్దుల‌కు ప్రత్యేక వ‌స‌తులు, విశాల‌మైన వెయిటింగ్ ఏరియా మ‌హిళ‌ల కోసం ఫీడింగ్ రూమ్‌, చిన్నపిల్లల కోసం క్రెచ్‌, వృద్దులు, దివ్యాంగుల కోసం ఆధునిక లిఫ్ట్ సౌక‌ర్యం త‌దిత‌రాల‌ను ఏర్పాటు చేస్తున్నాం.  ఇప్పటికే నాలుగు ఇంటిగ్రేటెడ్ భవానలకు శంకుస్థాపన చేసుకొని పనులు ప్రారంభించాం. ఈ గచ్చిబౌలి లో నిర్మిస్తున్న భావనాన్ని డిసెంబర్ లోగా అందుబాటులోకి తీసుకోస్తాం. ఒకటి, రెండు రోజుల్లో కోహెడలో   శంకుస్థాపన చేయబోతున్నాం.  రెండ‌వ విడ‌త‌లో జిల్లా కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్ భ‌వ‌నాల‌ను నిర్మిస్తాం.
మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల పథకం విజయమంతమైది. నిరుపేదల స్వంత ఇంటి కలలను తీర్చే అవకాశం నాకు దక్కింది.  ఇది నాకు చాలా తృప్తినిచ్చింది.  ప్రారంభంలో ఎన్ని వత్తిడిలు వచ్చినా కూడా వెనుకకు తగ్గలేదు.  దాని ఫలితమే ఇప్పుడు కనిపిస్తుంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular