కులాలు లేకుండా రాజకీయం సాధ్యమేనా

- Advertisement -

కులాలు లేకుండా రాజకీయం సాధ్యమేనా
విజయవాడ, జూలై 1   ( వాయిస్ టుడే)

Is politics without castes possible?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ లక్ష్యం ఆంధ్రప్రదేశ్ లో నెరవేరుతుందా? అన్నది ఇప్పుడు సందేహంగా మారింది. కులాల ప్రస్తావన చేయకుండానే రాజకీయాలు చేస్తానని పవన్ కల్యాణ్ చెప్పడం ఆచరణలో సాధ్యమేనా? అన్న చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటే కులాలతో ముడిపడి ఉన్న రాజకీయం. గత కొన్ని దశాబ్దాలుగా కులాల మధ్యనే రాజకీయం నడుస్తుంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ కుల జాడ్యాన్ని కూకటి వేళ్లతో పీకివేయాలని ప్రయత్నించడం సాహసోపేతమైన చర్యగానే చూడాలి. ఆంధ్రప్రదేశ్ లో ఏ రాజకీయ పార్టీ అయినా కులం పునాదుల మీద నడవాల్సిందే. కొన్ని ఏళ్లుగా అన్ని పార్టీలూ అదే కోవలో నడుస్తున్నాయి కానీ ఇటీవల పవన్ కల్యాణ్ తాను కులం ప్రస్తావన లేకుండానే రాజకీయాలు చేస్తానని చెప్పడం ఒకింత ఆశ్చర్యకరమే. కులాలు పేరు చెప్పి తాను ఓట్లు అడగనని కూడా పవన్ కల్యాణ్ అనడం వచ్చే ఎన్నికల ప్రచారం వరకూ ఆగాల్సిందే. ఎందుకంటే గత ఎన్నికల్లోనూ పవన్ కల్యాణ్ కులం ప్రస్తావన తెస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. కానీ వచ్చే ఎన్నికల్లోనూ కాపు సామాజికవర్గం అండ పవన్ కల్యాణ్ కు అసవరం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారన్నది జనసైనికుల్లోనూ చర్చ మొదలయింది. అయితే పవన్ కల్యాణ్ కు సినిమాల పరంగా కులాలకు, మతాలకు అతీతంగా అభిమానులు ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.  కానీ రాజకీయాలకు వచ్చే సరికి వేరుగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో 27 శాతం ఓటు బ్యాంకున్న కాపు సామాజికవర్గాన్ని తెలివైన ఏ రాజకీయ నాయకుడు దూరం చేసుకోరు. పవన్ కల్యాణ్ కూడా అదే విశ్వాసంతో ఉన్నట్లు కనిపిస్తుంది. ఎన్నికల సమయానికి తనను వదిలి వెళ్లరన్న ధీమాలో ఆయన ఉన్నారు. కేవలం కాపు సామాజికవర్గం ఓట్లతోనే ఎవరూ గెలవలేరన్న పవన్ కల్యాణ్ మాటల్లోనూ నిజం లేకపోలేదు. అందుకే ముందుగా మిగిలిన సామాజికవర్గ ఓటర్లను దగ్గరకు తీసుకోవడం ప్రధమ లక్ష్యంగా పవన్ కల్యాణ్ పెట్టుకున్నట్లు కనపడుతుంది. చివరకు కాపులు తనను వీడి పోరన్న నమ్మకమే పవన్ ను నోట ఆ మాట పలకిస్తుందంటున్నారు. మరి ఎన్నికల నాటికి పవన్ మాట తీరు ఎలా మారుతుందన్నది చూడాలి.
నాయకత్వ లక్షణాలపై 3 రకాల అప్లికేషన్లు
మీరు జనసేన కార్యకర్తా.. నేతగా ఎదగాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం. అప్లికేషన్‌ సమర్పించండి అంటోంది ఆ పార్టీ అధిష్టానం. పైస్థాయిలో ఉండే లీడర్లు.. కిందిస్థాయి నేతలను నియమించడం, అన్ని పార్టీల్లో ఆనవాయితీగా వస్తోంది. అయితే జనసేన కార్యకర్తల నుంచే నేతలు పుట్టుకురావాలనే ఆలోచనకు, ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఓ ఆకారం ఇచ్చారు. దీంతో కార్యకర్తలను మాత్రమే కాదు.. పార్టీ కోసం నాయకులను తయారుచేసే ఫ్యాక్టరీగా జనసేన మారుతోంది. దీనిలో భాగంగా క్షేత్రస్థాయిలో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్, మండల, గ్రామస్థాయిలో నేతలుగా ఎదగాలనే ఆసక్తి, రాజకీయ శక్తి ఉన్న జనసైనికులు, వీర మహిళలను ప్రోత్సహిస్తోంది.అభ్యర్థుల నుంచి ఐదు రోజుల పాటు అప్లికేషన్లు తీసుకుంటారు. దీనికోసం క్షేత్రస్థాయిలో 32మందితో పరిశీలన కమిటీ ఏర్పాటుచేశారు. అప్లికేషన్‌ తీసుకున్నాక, కార్యకర్తలు ఏ ఉద్దేశంతో వస్తున్నారు.. ఎలా పనిచేస్తారు.. వాళ్ల నాయకత్వ లక్షణాలపై స్క్రూటినీ చేస్తారు. దీనికోసం మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో మూడు రకాల డెస్కులు ఏర్పాటుచేశారు. అక్కడ మూడు రకాల అప్లికేషన్లు ఇస్తారు. ఎవరు ఏ కేటగిరీ కింద అప్లయ్‌ చేయాలనుకుంటే, ఆ అప్లికేషన్‌ తీసుకోవచ్చు.పార్లమెంట్ స్థాయి నాయకులు, అసెంబ్లీ స్థాయి నాయకులు, మండల, గ్రామస్థాయి…ఇలా రకరకాల స్థాయిల్లో నాయకులను నియమించుకునేందుకు, పార్టీ శ్రేణుల్లో ఆసక్తి ఉన్నవారి నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తామన్నారు మంత్రి కందుల దుర్గేష్‌.క్షేత్రస్థాయిలో నాయకులను నియమించడంలో, పవన్‌ కల్యాణ్‌ నిర్ణయమే ఫైనల్‌ అని మంత్రి తేల్చిచెప్పారు. కార్యకర్తలే నేతలుగా ఎదిగితే…క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం అవుతుందనే ఆలోచనతో జనసేన ఈ కార్యాచరణ చేపట్టింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular