ఎల్కతుర్తి రోడ్డుకు మంత్రి పొన్నం శంకుస్థాపన
హుస్నబాద్
Minister Ponnam lays foundation stone for Elkathurthy road.
ఎల్కతుర్తి జంక్షన్ నుండి మడిపల్లి రోడ్డు కు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేసారు. మంత్రి మాట్లాడుతూఐ ఎల్కతుర్తి జంక్షన్ నుండి మడిపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామి రెడ్డి, వైస్ చైర్మన్ జిల్లా కలెక్టర్ లకు మా స్థానిక నాయకుల తరుపున ధన్యవాదాలుని అన్నారు.
ఎల్కతుర్తి జంక్షన్ నుండి మడిపల్లి రోడ్డు కు ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది.. త్వరగా పనులు పూర్తి చేయాలి. రోడ్డు పూర్తయితే చుట్టుపక్కల భూముల ధరలు కూడా పెరుగుతాయి. ఎల్కతుర్తి లో కోర్టు వస్తుంది,సబ్ స్టేషన్ వస్తుందని అన్నారు.
భవిష్యత్ లో ఎల్కతుర్తి అభివృద్ధిలో ముందు ఉంటుంది. ఎల్కతుర్తి జంక్షన్ నుండి మడిపల్లి రోడ్డు పూర్తయితే అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. మండలంలో పెండింగ్ రోడ్డు పనులు పూర్తి చేయాలని అన్నారు.




