100 కోట్ల క్లబ్ లో మా ఇంటిబంగారం

- Advertisement -

100 కోట్ల క్లబ్ లో మా ఇంటిబంగారం
హైదరాబాద్ జూలై 13 ( వాయిస్ టుడే

Our ‘Inti Bangaram’ (Family Gem) in the 100-Crore Club.
టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన సమంత రూత్ ప్రభు ( ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా ‘మా ఇంటి బంగారం’. బాక్స్ ఆఫీస్ బరిలో సరికొత్త చరిత్ర లిఖించింది. తెలుగు చిత్రసీమలో బాక్స్ ఆఫీస్ చరిత్రలో అరుదైన ఘనత సొంతం చేసుకుంది. వంద కోట్ల క్లబ్బులో చేరిందీ సినిమా.సమంతకు ముందు కొంత మంది హీరోయిన్లు ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేశారు. విజయాలు సాధించారు. అయితే… అవేవీ వంద కోట్ల క్లబ్బులో చేరలేదు. వంద కోట్లు కలెక్ట్ చేసిన మొదటి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాగా ‘మా ఇంటి బంగారం’ రికార్డు క్రియేట్ చేసింది. థియేటర్లలో విడుదలైన 24వ రోజున 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా సాధించడం విశేషం.2026లో విడుదలైన సినిమాల్లో, ఆమాటకు వస్తే ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లో అతి పెద్ద కమర్షియల్ సక్సెస్‌లలో ‘మా ఇంటి బంగారం’ ఒకటి అని చెప్పవచ్చు. ఇండియాలో హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన సోలో ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లో ఆరో స్థానాన్ని దక్కించుకుంది. బడ్జెట్‌ కంటే 300 శాతం పైగా రికవరీ సాధించింది. ఈ చిత్రానికి ఓవర్సీస్ నుంచి కూడా మంచి స్పందన లభించింది. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లో 2.5 మిలియ‌న్స్ డాల‌ర్స్ క‌లెక్ష‌న్లతో అత్యధిక ఓవర్సీస్ కలెక్షన్స్ సాధించిన ఫిమేల్ ఫిల్మ్‌గానూ నిలిచింది.”ఇది (వంద కోట్ల వసూళ్ళు) మాకు కేవలం ఓ సంఖ్య మాత్రమే కాదు… ‘మా ఇంటి బంగారం’తో మహిళా ప్రాధాన్య కథలతో నడిచే సినిమాలను స్వీకరించేందుకు మన ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారని మరోసారి నిరూపితం అయ్యింది” అని సమంత అన్నారు. ”నేను తెలుగు సినిమా చేశాను (తెలుగు వ్యక్తి అయినప్పటికీ ముందు హిందీ సినిమాలు చేశారు). మా సినిమాకు ప్రేక్షకులు చూపించిన ప్రేమ, ఆదరణ చూసి ఆనందంగా ఉంది. ఆడియన్స్ అందరికీ థాంక్స్” అని ‘మా ఇంటి బంగారం’ క్రియేటర్, ప్రొడ్యూసర్ రాజ్ నిడిమోరు చెప్పారు.రాజ్ కె నిడిమోరు కథ, స్క్రీన్ ప్లే అందించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి బీవీ నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. రాజ్, సమంత, హిమాంక్‌ రెడ్డి దువ్వూరు సంయుక్తంగా నిర్మించారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రమిది. జూన్ 19న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. తమిళంలో ‘ఎంగళ్ తంగం’ పేరుతో విడుదలైన ఈ సినిమాలో గుల్షన్ దేవయ్య, దిగంత్, గౌతమి, శ్రీముఖి, శ్రీనివాస్ గవిరెడ్డి, శ్రీలక్ష్మి త‌దిత‌రులు ప్రధాన తారాగణం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular