అమెరికా త్రిశంకు స్వర్గంలో ఎన్నారైలు
హైదరాబాద్
NRIs in America: Caught in Limbo
ఉద్యోగం పోయిన తర్వాత, కొన్ని కుటుంబాలకు మొదటి షాక్ వీసా అయితే, రెండో షాక్ వాళ్లు కొన్న ఇల్లు. అమెరికాలో ఇల్లు కొనేసిన వాళ్లు ఇప్పుడు ఒక విచిత్రమైన ఉచ్చులో చిక్కుకున్నారు. దీనిని నెగెటివ్ ఈక్విటీ అంటారు. ఒక ఉదాహరణతో చూస్తే ఇది సులభంగా అర్థమవుతుంది: “ఒక ఉద్యోగి ఐదేళ్ల క్రితం మార్కెట్ బాగున్నప్పుడు ₹8 కోట్లకు ఒక ఇల్లు కొన్నాడు. ఇప్పుడు మార్కెట్ పడిపోవడంతో ఆ ఇల్లు ₹7 కోట్లకే అమ్ముడవుతోంది. కానీ బ్యాంకుకు ఇంకా ₹7.5 కోట్ల లోన్ బాకీ ఉంది. అంటే, ఇప్పుడు ఆ ఇల్లు అమ్మేసినా కూడా బ్యాంకు అప్పు తీరదు, పైగా జేబులోంచి మరో ₹50 లక్షలు కట్టాలి!”దీంతో అటు ఇల్లు అమ్మలేక, ఇటు నెలకు లక్షల్లో ఈఎంఐలు కట్టలేక ఎంతోమంది ఐటీ ఉద్యోగులు ఊపిరాడకుండా బతుకుతున్నారు.ఒకప్పుడు డల్లాస్ సబర్బన్ ఏరియాలో కొత్త ఇళ్ల అమ్మకాల్లో 70% భారతీయులవే ఉండేవి. ఇప్పుడు అది 30% కంటే కిందకు పడిపోయింది. భారతీయులు కొనుగోలు చేయడం ఆపేయడంతో అక్కడ ఇళ్ల ధరలు ఏకంగా 9% పడిపోయాయి. ఒక్క డల్లాస్ మాత్రమే కాదు… సియాటిల్, నార్తర్న్ వర్జీనియా, రాలీ లాంటి ఐటీ ఆధారిత ప్రాంతాలు కూడా ఇప్పుడు ఈ వీసా నిబంధనలు, లేఆఫ్స్ వల్ల ప్రభావితమవుతున్నాయి.
అయితే అమెరికా కల పూర్తిగా ముగిసిపోయిందని చెప్పడం కూడా సరైంది కాదు. ఏఐ స్కిల్స్, స్పెషలైజ్డ్ టెక్నాలజీలు, హెల్త్‌కేర్, సెమీకండక్టర్స్ వంటి రంగాల్లో అవకాశాలు ఇంకా ఉన్నాయి. కానీ ‘అమెరికా వెళ్తే జీవితం ఆటోమేటిక్‌గా సెటిల్’ అనే పాత ఫార్ములా మాత్రం ఇక పనిచేయడం లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కేవలం కోడింగ్ నాలెడ్జ్ సరిపోదు: పాత పద్ధతుల్లో సాఫ్ట్వేర్ నేర్చుకుంటే ఇప్పుడు సర్వైవ్ అవ్వడం కష్టం. ఏఐ టూల్స్‌ను వాడుకుంటూ వేగంగా పని చేయగల నిపుణులకే ఇప్పుడు డిమాండ్ ఉందఅదే పూజా గదుల్లో దీపం వెలిగించే కుటుంబాలు తగ్గుతున్నాయి. అదే ఇళ్ల ముందు ఫర్ సేల్ బోర్డులు పెరుగుతున్నాయి.మారింది ఇళ్లు కాదు. భారతీయులు అమెరికాను చూసే చూపు. అమెరికన్ డ్రీమ్ ముగిసిపోలేదు. కానీ, ఇప్పుడు ఆ కలను కొనడానికి డాలర్లు మాత్రమే సరిపోవు. కొత్త స్కిల్స్ కావాలి. కొత్త ధైర్యం కావాలి. ముఖ్యంగా అనిశ్చితితో బతకగలిగే మనస్తత్వం కావాలి.ఒకప్పుడు భారతీయుల కోసం పూజా గదులు కట్టించిన అమెరికా… ఇప్పుడు అదే పూజా గదుల్లో మళ్లీ ఎవరు దీపం వెలిగిస్తారో ఎదురు చూస్తోంది.




