తెలంగాణలో పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికెట్

- Advertisement -

తెలంగాణలో పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికెట్
హైదరాబాద్ జూలై 18 ( వాయిస్ టుడే)

Permanent Resident Certificate in Telangana
తెలంగాణలో కర్ణాటక రాష్ట్రం తరహాలో శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం విధానాన్ని ప్రవేశపెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా యోచిస్తోందని ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ వెల్లడించారు. ఈ కొత్త విధానం సాధ్యసాధ్యాలను సమగ్రంగా పరిశీలించడానికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో దీర్ఘకాలంగా నివసిస్తున్న ప్రజలు తమ శాశ్వత నివాసాన్ని సులభంగా నిరూపించుకోవడానికి వీలుగా ఒక ప్రామాణిక ప్రభుత్వ పత్రాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి షబ్బీర్ అలీ వినతిపత్రం సమర్పించారు.షబ్బీర్ అలీ అందించిన ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో ప్రాథమికంగా చర్చించారు. కర్ణాటకలో అమలులో ఉన్న పి.ఆర్.సి విధానాన్ని, దాని ఫ్రేమ్‌వర్క్‌ను అధ్యయనం చేసి తెలంగాణలో కూడా అలాంటి వ్యవస్థను తీసుకురావడానికి ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు క్యాబినెట్ సబ్‌ కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. ఓటర్ల వెరిఫికేషన్ సమయంలో పరిశీలించదగిన పత్రాల జాబితాలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం కూడా ఒకటని షబ్బీర్ అలీ గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం పూర్తి పరిశీలన తర్వాత అధికారికంగా జారీ చేసే పి.ఆర్.సి, ఓటర్లు తమ అర్హతను నిరూపించుకోవడానికి ఒక బలమైన మద్దతు పత్రంగా ఉపయోగపడుతుందని వివరించారు.ఈ కొత్త నివాస ధ్రువీకరణ పత్రం వస్తే చాలా ప్రయోజనకరంగా ఉండనుంది. 2002 నాటికి ఓటు హక్కు వయసు లేని వారికి ఇది నివాస ఆధారంగా మారుతుంది. వివాహం తర్వాత పేర్లు, చిరునామాలు మారిన మహిళలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఒక నియోజకవర్గం లేదా జిల్లా నుండి మరొక ప్రాంతానికి మారిన కుటుంబాలకు నివాస ధ్రువీకరణ సులువవుతుంది. పాత రికార్డులలో పేర్ల స్పెల్లింగులు లేదా అనువాద లోపాల వల్ల తమ వివరాలను కనుగొనలేకపోతున్న నివాసితులకు ఈ పత్రం ద్వారా మేలు జరుగుతుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular